విశాఖ నగరాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలకు రూపుదిద్దుకుంటున్నాయి. తర్వరలోనే విశాఖ నగరానికి సీప్లేన్ సర్వీస్ రానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన కార్యచరణ కూడా రూపుదిద్దుకుంటోంది. ఉన్నతస్థాయిలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే మాల్దీవుల్లో సూపర్ సక్సెస్ అయిన సీప్లేన్ సర్వీస్ ను ఇండియాలోనూ పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 28 సీప్లేన్ మార్గాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ సీప్లేన్ సర్వీస్ కోసం వాటర్ ఏరోడోమ్ […]