తెలుగు అభిమానులని అలరించడానికి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సిద్ధమవుతుంది. తొలి మ్యాచ్ లో బెజవాడ టైగర్స్ తో కోస్టల్ రైడర్స్ ఢీ కొడుతుంది.
తెలుగు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నేడు మొదలుకానుంది. గతేడాది ఈ లీగ్ తొలిసారి నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో ఎన్నో క్రికెట్ దేశాలు లీగ్ లు ఆడుకున్నట్లే దేశంలో కూడా ప్రతి క్రికెట్ ఆడే ప్రధాన రాష్ట్రాలు సొంత లీగ్ ఆడుకుంటున్నాయి. ఇటీవలే తమిళనాడు ప్రీమియర్ లీగ్, మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ అభిమానులని అలరించగా.. తాజాగా తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సిద్ధమైంది. ఇటీవలే ఈ లీగ్ కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయగా నేటి నుంచి 27 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఇదిలా ఉండగా.. ఈ రోజు తొలి మ్యాచ్ ని చూడడడనికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల రానుండడం గమనార్హం.
ఈ లీగ్ లో భాగంగా ఉత్తరాంధ్ర లయన్స్, బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్ జట్లు ఉన్నాయి. ఈ ఆరు జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్ తరహాలోనే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కూడా జరగనుంది. మ్యాచ్‌లన్నీ విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జరగనున్నాయి. ఇక ఈ మ్యాచ్ వీక్షించే అభిమానులకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేసారు. లక్కీ డిప్ ద్వారా విశాఖలో జరిగే భారత్- ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మ్యాచ్ కి టికెట్లు అందించనున్నారు. కోస్టల్ రైడర్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఈ మ్యాచులో బరిలోకి దిగుతుంది. మరి ఆంధ్రాలో జరగబోయే ఈ లీగ్ సీజన్ 2 అభిమానులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
ఏపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆగస్టు 16, 5 PM, కోస్టల్ రైడర్స్ vs బెజవాడ టైగర్స్
ఆగస్టు 17, 10 AM, వైజాగ్ వారియర్స్ vs గోదావరి టైటాన్స్
ఆగస్టు 17, 3 PM, రాయలసీమ కింగ్స్ vs ఉత్తరాంధ్ర లయన్స్
ఆగస్టు 18, 12 PM, కోస్టల్ రైడర్స్ vs వైజాగ్ వారియర్స్
ఆగస్టు 18, 5 PM, బెజవాడ టైగర్స్ vs గోదావరి టైటాన్స్
ఆగస్టు 19, 10 AM, బెజవాడ టైగర్స్ vs రాయలసీమ కింగ్స్
ఆగస్టు 19, 3 PM, ఉత్తరాంధ్ర లయన్స్ vs కోస్టల్ రైడర్స్
ఆగస్టు 20, 10 AM, ఉత్తరాంధ్ర లయన్స్ vs వైజాగ్ వారియర్స్
ఆగస్టు 20, 3 PM, గోదావరి టైటాన్స్ vs రాయలసీమ కింగ్స్
ఆగస్టు 21, 12 PM, బెజవాడ టైగర్స్ vs ఉత్తరాంధ్ర లయన్స్
ఆగస్టు 21, 5 PM, రాయలసీమ కింగ్స్ vs వైజాగ్ వారియర్స్
ఆగస్టు 22, 12 PM, గోదావరి టైటాన్స్ vs కోస్టల్ రైడర్స్
ఆగస్టు 22, 5 PM, వైజాగ్ వారియర్స్ vs బెజవాడ టైగర్స్
ఆగస్టు 23, 12 PM, కోస్టల్ రైడర్స్ vs రాయలసీమ కింగ్స్
ఆగస్టు 23, 5 PM, ఉత్తరాంధ్ర లయన్స్ vs గోదావరి టైటాన్స్
ఆగస్టు 25, 12 PM, ఎలిమినేటర్
ఆగస్టు 25, 5 PM, క్వాలిఫైయర్ 1
ఆగస్టు 26, 5 PM, క్వాలిఫైయర్ 2
ఆగస్టు 27, 5 PM, ఫైనల్