దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటేందుకు రైల్వే శాఖ ‘భారత్ గౌరవ్’ పేరుతో ప్రత్యేక పర్యాటక రైళ్లను ప్రవేశపెట్టింది. కానీ ఈ రైళ్లకు ఆశించినంత స్థాయిలో డిమాండ్ లభించకపోవడంతో ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం వల్లే జనం ఆసక్తి చూపడం లేదని.. టికెట్ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రైళ్ల టికెట్ల ధరను దాదాపు 30 శాతం తగ్గించాలని ఐఆర్సీటీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. […]
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. గ్రౌండ్ లో తన బ్యాటింగ్, బౌలింగ్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తాడు. క్రికెటర్ గానే కాకుండా బాలీవుడ్ లో నటుడిగా సత్తా చాటాడు. 2007 లో ప్రపంచ కప్ లో ఒకే ఓవర్ లో 6 సిక్సర్లు సాధించి చరిత్ర సృష్టించాడు. తాజాగా యువరాజ్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. గోవా సర్కార్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు తమ ముందు హాజరు […]
విశాఖ నగరాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలకు రూపుదిద్దుకుంటున్నాయి. తర్వరలోనే విశాఖ నగరానికి సీప్లేన్ సర్వీస్ రానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన కార్యచరణ కూడా రూపుదిద్దుకుంటోంది. ఉన్నతస్థాయిలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే మాల్దీవుల్లో సూపర్ సక్సెస్ అయిన సీప్లేన్ సర్వీస్ ను ఇండియాలోనూ పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 28 సీప్లేన్ మార్గాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ సీప్లేన్ సర్వీస్ కోసం వాటర్ ఏరోడోమ్ […]
ప్రముఖ నటి రోజా సెల్వమణి.. ఇటీవల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక యువజన శాఖామాత్యులుగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. రెండుసార్లు ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పటికీ రోజా.. పలు టీవీ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యహరించింది. ఈ క్రమంలో ఏపీ టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆమె టీవీ ప్రోగ్రాంలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం రోజా తన మంత్రి పదవీ బాధ్యతలపైనే ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోజాకు మే 7న చెన్నైలో […]
కాకతీయుల ఘనమైన శిల్పకళా వైభవానికి,అద్భుత నిర్మాణశైలికి ప్రతీక, 800 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సుప్రసిద్ధ రామప్ప(రుద్రేశ్వర స్వామి)ఆలయంవైపు ఇప్పుడు విశ్వమంతా అబ్బురపడి చూస్తోంది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి అరుదైన గౌరవం లభించింది.రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. చైనాలోని ఫ్యూజు వేదికగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ (యూడబ్ల్యూహెచ్‌సీ) సమావేశం వర్చువల్‌గా జరుగుతోంది.డబ్ల్యూహెచ్‌సీ ప్రతినిధులు రామప్పను ప్రపంచ […]
విహార, తీర్థ యాత్రలు, పండుగలు, అన్నీ ముఖ్యమైనవే అయినప్పటికీ ప్రజలు మరికొద్ది నెలలు సంయమనం పాటించాలని ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) సూచించింది. ఓవైపు అందరికీ వ్యాక్సిన్ అందనే లేదని అయినా సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రజలకు అనుతివ్వడమంటే థర్డ్ వేవ్‌కు కారణమయ్యే ‘‘సూపర్ స్ర్పెడర్ల’’ను అందించినట్లేనని హెచ్చరించింది. ఆర్ధిక , వాణిజ్య ఒత్తిళ్లతో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తుండడం సామాజిక దూరం, శానిటైజేషన్, వ్యాక్సినేషన్ ను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం తదితర పరిణమాలు థర్డ్ వేవ్ […]
ప్లాస్టిక్ కవర్లు.. డబ్బాలు.. బాటిళ్లు.. పొద్దున లేచిన దగ్గర్నుంచీ వాడే పాలప్యాకెట్ నుంచి సమస్తం ప్లాస్టిక్‌మయం. ఆ ప్లాస్టిక్ చెత్తంతా ఇలా నాలాల్లోకి చేరుతోంది. ఉందన్న విషయమే తెలియనంతగా ప్లాస్టిక్ చెత్త కప్పేసింది. ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలనే ప్రసంగాలు వినపడతాయి. కానీ.. తేదీ మారగానే ప్లాస్టిక్ సంగతీ అందరూ మర్చిపోతున్న పరిస్థితి. అలా కాకుండా ఇకనుంచైనా ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత తగ్గించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని భావితరాల వారికి […]