ఆర్టీసీ బస్ ప్రయాణీకులకు ఎంతో సురక్షితం.. ప్రైవేల్ వాహనాల్లో ప్రయాణాలు మానండి.. ఆర్టీసీ బస్ లో ప్రయాణించండి అంటూ అధికారులు తెగ ప్రచారాలు చేస్తుంటారు. కానీ కొంత మంది డ్రైవర్లు, కండక్లర్ల అనుచిత ప్రవర్తన వల్ల ఎంతో మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఆటోలు, ప్రైవేట్ వాహనాలు వద్దు.. ఆర్టీసీ ముద్దు అని.. మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని అధికారులు తెగ ప్రచారం చేస్తుంటారు. అంతేకాదు ప్రయాణీకులు మా దేవుళ్లు అంటారు. కానీ కొంత మంది డ్రైవర్లు, కండక్టర్ల తీరు చాలా దారుణంగా ఉంటుంది. ప్రయాణీకులపట్ల అనుచితంగా ప్రవర్తించడం… నిర్లక్ష్యంగా వ్యవహరించడం చేస్తుంటారు. బస్సు ఎక్కే సమయంలో.. దిగే సమయంలో తొందరపెట్టడం వల్ల ప్రయాణీకులు చిల్లర తీసుకోవడం మర్చిపోతుంటారు.. మరికొంతమందికి గాయాలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ బస్ కండక్టర్ వృద్దురాలి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో పల్నాడు జిల్లా లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.. ప్రయాణీకులు మాకు దేవుళ్లు అంటూ ప్రచారాలు చేస్తుంటారు. కానీ కొంతమంది కండక్టర్లు, డ్రైవర్ల నిర్వాకం వల్ల ప్రయాణీకులు ఎంతో ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా బస్సుల్లో వృద్దుల పట్ల కండెక్టర్లు అనుచితంగా ప్రవర్తించడం.. వారు బస్సు త్వరగా దిగాలని తొందరపెట్టడం లాంటివి చూస్తూనే ఉంటాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిల్లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి డిపో వద్ద ఓ వృద్దురాలు బస్సులో నుంచి దిగుతున్న సమయంలో త్వరగా దిగాలి.. బస్సు వెళ్లాలి అంటూ కండక్టర్ తొందరపెట్టాడు. ఫుడ్ బోర్డ్ వద్దకు రాగానే వృద్ధురాలిని బస్సు నుంచి తోసేశాడు. దీంతో సదరు వృద్ధురాలు కిందపడిపోవడంతో తీవ్రంగా గాయాలు అయ్యాయి.
ఆ వృద్దురాలి కింద పడిందన్న జ్ఞానం కూడా లేకుండా బస్సును ముందుకు తీసుకు వెళ్లాలని డ్రైవర్ కి సూచించాడు కండక్టర్. కిందపడిన వృద్ధురాలికి కాయాలు కావడంతో తోటి ప్రయాణీకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కండక్టర్ తీరుకు వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆమెను తోసివేయడంపై తోటి ప్రయాణికులు భగ్గుమన్నారు. డిపోలోని అధికారులు, ఇతర ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే సదరు కండెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.