ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో నిండు జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యం ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యం, అతివేగం, నిద్ర లేమి ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల డ్రైవింగ్ పై పూర్తి అవగాహన లేదన రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు పాటించాలని ట్రాఫిక్ అధికారులు ఎంతగా చెబుతున్నా నిర్లక్ష్యం వహిస్తూ వాహనాలు నడుపుతున్నారు వాహనదారులు. ఓ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకు వెళ్లడంతో 17 మంది జలసమాధి అయ్యారు. ఈ దారుణ ఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకు వెళ్లడంతో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలు సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 35 మందికి పైగా ఈ ఘటనలో గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. భండారియా జిల్లా నుంచి ఫిరోజ్ పూర్ కు 70 మందితో వెళ్తున్న బస్సు ఛత్రకాండ ప్రాంతంలో అకస్మాత్తుగా అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఝలకతి జిల్లా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి లో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
భండారియా జిల్లా నుంచి ఫిరోజ్‌పూర్ బయలుదేరిన బస్సు ఛత్రకాండ వద్ద స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలోకి రాగానే ఆటో రిక్షాను తప్పించబోయి చెరువులో పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అప్పటికే డ్రైవర్ బస్సును వేగంగా నడుపుకుంటూ రావడం.. కంట్రోలో చేయలేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను బస్సులో ఎక్కించడం వల్ల బస్ ని కంట్రోల్ చేయలేక చెరువులోకి దూసుకు వెళ్లిఉంటుందని పోలీసులు అంటున్నారు. చెరువులో నుంచి బస్సును వెలికి తీసేందుకు క్రేజ్ ని ఉపయోగిస్తున్నారు పోలీసులు.