పలు అంశాలపై తన యూట్యూబ్ వీడియోలు, ఫేస్ బుక్ లైవ్ ద్వారా పేరు తెచ్చుకున్న వ్యక్తి రాజేష్ మహా సేన. అతడూ చేసే వీడియోల్లో జన సేన మద్దతుగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మరో పార్టీలో చేరారు.
ప్రముఖ తెలుగు యూట్యూబర్ మహాసేన రాజేష్ టీడీపీలోకి చేరారు. శుక్రవారం ఉదయం అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో దళిత సామాజిక వర్గంతో నిర్వహించిన సమావేశంలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సామాజిక వర్గానికి చెందిన మహా సేన రాజేష్ మరికొంత మందితో కలిసి పార్టీలోకి చేరారు. వివిధ అంశాలపైన మహా సేన మీడియా అనే తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తూ ఉంటారు. పలు అంశాలపై చర్చిస్తూ రాజేష్ ఫేమస్ అయ్యారు ఆ వీడియోల్లో జనసేన మద్దతుదారుడిగా కనిపించిన ఆయన.. చివరకు టీడీపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి చేరక ముందు పలువురు టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు.
2019లో వైసీపీలోకి చేరిన ఆయన .. ఆ తర్వాత జగన్ పాలనా విధానాన్ని తన యూట్యూబ్ చానల్ ద్వారా విమర్శిస్తుంటారు. దీంతో అతడూ ఫేమస్ అయ్యాడు. తాజాగా టీడీపీలోకి చేరిన ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి 40 ఏళ్ల చరిత్ర ఉందని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును విలన్‌లా చూపించారని రాజేష్ చెప్పుకొచ్చారు. దళితులకు ద్రోహం చేశారని నమ్మించారని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్నారు. చంద్రబాబును అపార్థం చేసుకుని, జగన్ గెలుపు కోసం పనిచేసామని, కానీ ఆ తర్వాత అసలు నిజాలు తెలిశాయన్నారు. చీకటి వచ్చిన తర్వాతే వెలుగు విలువ తెలుస్తుందని, జగన్ అస్తవ్యస్త పాలన చూశాక చంద్రబాబు పాలన ఎంత గొప్పదో అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. మహా సేన రాజేష్ టీడీపీలో చేరడం సబబా, కాాదో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Congratulations @Mahasena Rajesh garu to Join TDP pic.twitter.com/KhrOveyCYt
— Y Naga Prabhakararao (@ynpr7407) February 17, 2023