విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్.. మంచు మోహన్ బాబు తరచుగా.. ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చేసే వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదంగా ఉంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. ఈ సారి ఏకంగా పోలీసుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. వారి కోసమే పని చేస్తున్నారంటూ.. మోహన్‌బాబు.. వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అంతేకాక పోలీసు ఉన్నతాధికారులు గవర్నమెంట్‌కు తొత్తులుగా ఉంటున్నారు.. నేను నిజాన్ని నిర్భయంగా చెప్తానంటూ వివాదానికి తెర తీశారు మోహన్‌బాబు.
విశాల్ హీరోగా నటించిన.. లాఠీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు మోహన్‌బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పోలీసులంటే నాకు ఎంతో గౌరవం. వాళ్లు కూడా మనలాంటి సామాన్యుల నుంచే ఆ ఉద్యోగాల్లోకి వెళ్లిన వాళ్లు. మనం పోలీసులకు కచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే. సమాజంలో చోటు చేసుకునే ఏం సంఘటన గురించి అయినా.. ఏ నిజమైనా ముందుగా పోలీసులకు.. అందులోనూ కానిస్టేబుల్‌కే తెలుస్తుంది’’ అన్నారు.
ఆ వెంటనే.. ‘‘కానీ ఇక్కడ నాకు భాదనిపించే విషయమేంటంటే.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్‌కు అనుకూలంగా పని చేయాల్సిన బాధ్యత కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లపై ఉంటోంది. కిందిస్థాయి పోలీసులు తమ పైఅధికారుల దగ్గరికి వెళ్లి.. నేను నిజం చూశాను.. కానీ నన్ను తప్పు చెప్పమంటున్నారని చెబితే.. అతడిని ఏకంగా ఉద్యోగం నుంచే తొలగిస్తున్నారు. అంటే అతడి పైఅధికారులు.. ఎక్కువ శాతం అధికారంలో ఎవరు ఉంటే.. ఆ గవర్నమెంటుకు తొత్తులుగా ఉంటారు. ఇది నేను ఓపెన్‌గా చెప్తున్నాను. కానీ నేను ఎప్పుడూ పోలీసు డిపార్ట్ మెంట్‌కు గౌరవం ఇస్తాను’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు.
ఇప్పటికే మంచు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతుంటారు. ముఖ్యంగా మంచు మనోజ్, లక్ష్మి చేసే వ్యాఖ్యలు ఏ రేంజ్‌లో ట్రోలింగ్‌కు గురవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది.. ఇక ఈ సారి ఏకంగా మోహన్‌బాబు.. పోలీసు అధికారులను ఉద్దేశించి.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మరి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి. మరి పోలీసు అధికారులను ఉద్దేశించి.. మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.