ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తిరుమతి నుండి తిరుమలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి.. డివైడర్‌ను దాటుకొని పిట్టగోడను ఢీ కొట్టిన ఘటన మర్చిపోక ముందే.. మరో రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తిరుమతి నుండి తిరుమలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి.. డివైడర్‌ను దాటుకొని పిట్టగోడను ఢీ కొట్టింది. ఇది తిరుమల ఘాట్ రోడ్డులో జరగ్గా.. ఎటువంటి ప్రాణ హాని కలగలేదు. ఈ ఘటన మర్చిపోక ముందే తాజాగా మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అల్లూరి సీతారామ రాజు జిల్లా మారేడు మిల్లి చింతూరు ఘాట్ రోడ్డులో భారీ ప్రమాదం తప్పింది. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో కొంత సేపు గందగోళ పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపారు. ఈ ఘటన ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు భద్రాచలం వెళుతుంది. మారేడు మిల్లి ఘాట్ రోడ్డు వద్ద రాగానే బస్సుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. డ్రైవర్ బ్రేకు వేసేందుకు ప్రయత్నించినప్పటికీ అవి పడలేదు. డ్రైవర్ బ్రేకులను గట్టిగా నొక్కడంతో.. కొద్ది సేపటికీ బస్సు దుర్గమ్మ గుడి సమీపాన ఆగిపోయింది. అదృష్టవశాత్తూ బస్సు బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదానికి ప్రయాణీకులు సైతం కంగారు పడ్డారు. బస్సు ఆగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దుర్గమ్మ గుడి బస్సు ఆగడంతో ఆ అమ్మవారే తమను కాపాడిందని ప్రయాణీకులు చెప్పారు.