ఈ మద్య జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. ఎవరూ ఊహించని విధంగా అత్యధిక మెజార్టీతో టీడీపీ తరుపు నుంచి పంచుమర్తి అనురాధ గెలిచింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పపడ్డారని అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది.
ఏపీలో ఈ మద్య జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి దెబ్బ పడింది. ఈ ఎన్నికలను అధికార పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. అనూహ్యంగా టీడీపీ తరుపు నుంచి పంచుమర్తి అనురాధ గెలిచింది. అయితే అధికార నేతలు క్రాస్ ఓటింగ్ కి పాల్పపడ్డట్టు అధిష్టానం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇందులో ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్, ఉండవల్లి శ్రీదేవి లు ఉన్నారు. ఇక సస్పెన్షన్ కి గురైన నేతలపై అధికార పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వివరాల్లోకి వెళితే..
ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పై ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ అంటే ఎంతో అభిమానం అని.. ఆయన చేస్తున్న అభివృద్ది పనులు ఏ నాయకులు చేయలేరని చెప్పిన ఉండవ్లలి శ్రీదేవి ఒక్కసారిగా ఫ్లేట్ ఫిరాయించిందని అన్నారు. ఎన్నికలు జరిగే సమయంలో ఎంతో హడావుడి చేశారని.. సినిమాల్లో కన్నా అద్భుతంగా నటించిందని.. తీరా చేయాల్సిన ఘనకార్యం చేసిందని అన్నారు. ఆమెపేరు ఉండవల్లి శ్రీదేవి కన్నా ఊసరవెల్లి శ్రీదేవి అని మార్చుకుంటే చాలా బెటర్ అన్నారు. అంతేకాదు సినిమా నటి శ్రీదేవి కన్నా.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అద్భుతంగా నటించిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేశానని అందరినీ భలే నమ్మించే ప్రయతం చేస్తూ అద్భుతంగా నటించిందని మండిపడ్డారు.
ఇప్పటికైనా కొంతమంది అసలు రంగులు బయట పడ్డాయని.. ఊసరవెల్లులన్నీ పెద్ద ఊసర వెల్లి వద్దకు చేరుకుంటున్నాయని విమర్శించారు. తనకు అన్యాయం జరిగిందని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? దొంగచాటుగా కోట్లు తీసుకొని నమ్మిన వాళ్లను మోసం చేయడం ఆమెకు ఎంత వరకు న్యాయమో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. నాలుగేళ్లు కనిపించని లోపాలు ఇప్పుడు ఎలా కనిపించాయని అమర్ నాథ్ ప్రశ్నించారు. శ్రీదేవి లాంటివాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. ఉండవెల్లి శ్రీదేవి పచ్చ కండువా కప్పుకొని జనాల్లోకి వస్తే అసలు రంగు బయట పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.10 కోట్ల రూపాయలు ఇస్తాము ఓటు వేయమని అడిగారని స్వయంగా ఎమ్మెల్యే రాపాక చెప్పాక.. ఇక కొత్తగా చర్చలెందుకు.. అందరికీ బాహాంగానే తెలిసిపోయింది కదా అని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు పన్నినా.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీఎం జగన్.. ఇది పక్కా అని అన్నారు.