కర్నూలు- కన్నతండ్రి జ్ఞాపకార్థం ఓ కుమారుడు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని పేదలకు పంచాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. కర్నూల జిల్లా తుగ్గలి ప్రాంతానికి చెందిన కుమ్మరి నాగేంద్ర తన తండ్రి సుంకన్న జ్ఞాపకార్థం బుధవారం 6 కోట్ల రూపాయలు విలువ చేసే 12 ఎకరాల భూమిని 650 మంది పేదల ఇళ్ల కోసం పంపిణీ చేశారు. ఇందుకోసం బుధవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు భారీగా ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. వారి సమక్షంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు నాగేంద్ర. అంతేకాక ఎలాంటి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తున్నారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపాడు. నాగేంద్ర చేసిన పనికి అతడిని ప్రశంసిస్తున్నారు జనాలు. నాగేంద్ర చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.