అమ్మా అన్న పిలుపు అమృత భాండం. ఆ పిలుపే బిడ్డకు శ్రీరామ రక్ష. అమ్మా అన్న పిలుపు వినిపిస్తే చాలు.. తల్లి మృత్యువును సైతం ఎదిరించి వెనక్కి వస్తుంది. ఇదే తరహా సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించినది ఏది లేదు అంటారు. తల్లి ప్రేమే బిడ్డకు శ్రీరామ రక్ష. బిడ్డ దగ్గరకు కష్టం రావలంటే ముందుగా.. తల్లిని దాటుకోవాలి. అమ్మ ఉన్నంత వరకు బిడ్డలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది. మృత్యువు కూడా తల్లి ప్రేమ ముందు తలవంచాల్సిందే. ఆ దేవుడు సైతం.. అమ్మ ప్రేమను పొందడానికి.. మానవుడిగా భూమీ మీద పుడతాడు అంటే.. తల్లి ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. బిడ్డ చిరునవ్వే ఆ తల్లికి ఆయువు. బిడ్డ నోటి నుంచి అమ్మా అన్న పిలుపు వినిపిస్తే.. చాలు ఎక్కడ.. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే.. ఆఖరికి మరణశయ్య మీద ఉన్నా సరే.. బిడ్డ కోసం వెనక్కి వస్తుంది తల్లి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చేసింది. ప్రాణాలతో పోరాడుతున్న తల్లి.. అమ్మా అనే పిలుపుకు చలించింది. కానీ అంతలోనే అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆ వివారలు..
ఈ విషాదకర సంఘటన కాకినాడలో చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్‌కు గురైన మహిళ.. బిడ్డ.. అమ్మా అన్న పిలుపుతో స్పందించింది. ఇక ఆమె కోలుకుంటుందని అందరూ భావించారు. కానీ వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. సదరు మహిళ మృత్యువాత పడింది. కనకదుర్గ అఖిల అనే మహిళ.. కాకినాడ, అన్నవరం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. కుటుంబం, ఉద్యోగం మాత్రమే కాక.. సమాజ సేవ కోసం కూడా సమయం కేటాయించేది. ఈ క్రమంలో తోటి ఉపాధ్యాయులతో కలిసి.. సంకల్పం పేరిట.. ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి.. తనకు చేతనైనంతలో తోచిన సాయం చేస్తోంది కనకదుర్గ. ఆమెకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
ప్రేమించే భర్త, ప్రాణంలా భావించే బిడ్డతో.. సాఫిగా సాగిపోతున్న కనకదుర్గ జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో విధి ఆమెను వెంటాడింది. శనివారం పదో తరగతి చివరి పరీక్ష ఇన్విజిలేషన్ విధులు నిర్వహించుకుని.. తిరిగి ఇంటికి వస్తోంది కనకదుర్గ. ఇంతలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ.. కనకదుర్గ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. బ్రెయిన్‌డెడ్ అయ్యి కోమాలోకి వెళ్లిపోయింది. అయితే కనకదుర్గ.. తన మరణానంతరం అవయవాలు దానం చేయాలని భావించింది. దాంతో వైద్యులు అవయవదానం నిమిత్తం కనకదుర్గను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్తుండగా.. ఊహించని ఘటన చోటు చేసుకుంది.
కనకదుర్గను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్తుండగా.. సడెన్‌గా ఆమె చేయి కదిలింది. దాంతో కుటుంబ సభ్యులు.. కనకదుర్గ రెండేళ్ల కుమారుడిని ఆమె వద్దకు తీసుకువచ్చారు. తల్లిని చూసిన బాలుడు భయపడ్డాడు. అమ్మకు ఏమైందో అని కంగారు పడుతూ.. భయంగా.. అమ్మా లే అని పిలిచాడు. అంతే అంతసేపు మృత్యువుతో పోరాడుతున్న కనకదుర్గలో.. అమ్మ అన్న పిలుపుతో చలనం వచ్చింది. దాంతో వైద్యులు అవయవదానం కార్యక్రమం ఆపేసి.. ఆమెకు చికిత్స అందించడం ప్రారంభించారు. అపాయం తప్పిందని కనకదుర్గ కుటుంబ సభ్యులు భావించారు. త్వరలోనే కోలుకుంటుంది అనుకున్నారు.
వైద్యులు కనకదుర్గకు చికిత్స చేయడంతో ఆమె 40 శాతం వరకు కోలుకుంది. ఇక ఆమెకు ఏ ప్రమాదం లేదని కుటుంబ సభ్యులు సంతోషిస్తుండగా.. బుధవారం సాయంత్రం అనూహ్య రీతిలో కనకదుర్గ తుది శ్వాస విడిచింది. అప్పటి వరకు కనకదుర్గ కోలుకుంటుంది.. పూర్తి ఆరోగ్యంగా తిరిగి వస్తుందని భావించిన కుటుంబ సభ్యులు.. ఈ సంఘటనతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. రెండేళ్లకే తల్లిని కోల్పోయి.. అమ్మ ప్రేమకు దూరమైన బిడ్డను చూసి ప్రతి ఒక్కరు కంట నీరు పెడుతున్నారు. మరి ఈ హృదయవిదారక ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.