ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని హత్య కలకలం రేపింది. రోజు మాదిరిగానే దారి వెంట పాఠశాలకు వెళుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వ్యక్తి దారుణంగా హత్యకు గురైయ్యారు.
ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం శివారులో ఓ టీచర్‌ని హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ రోజుల్లో చాలామంది విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. చెడు అలవాట్లకు లోనై మనీ మైండ్‌తో ఏపని చేయడానికైనా సిద్దపడుతుంటారు. చీటికి మాటికి గొడవలకు కారణం అవుతుంటారు. ఇలాంటి వారు సమాజంలో చీడపురుగుల్లా తయారవుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు ఎంప్లాయ్స్ కావడంతో వారికి విలువలు తెలియవు. పిల్లలతో స్పెండ్ చేయడానికి పేరెంట్స్ కి సమయం ఉండదు. ఫ్యామిలీ పరంగా విలువలు నేర్పేవారు తక్కువయ్యారు. ఉమ్మడి కుటుంబాలు కనబడకుండా పోయాయి. కుటుంబం ద్వారా నేర్చుకునే మంచి అలవాట్లు, చిన్న, పెద్ద విలువలు పిల్లలకు తగ్గిపోయాయి. నేటి యువత మంచి, చెడు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. చెడు సావాసాలు చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటివారే కొందరు గుర్తు తెలియని దుండగులు గురువు ప్లేస్‌లో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్‌ని దారుణంగా హత్య చేశారు. స్థానికంగా ఈ హత్య కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం గ్రామంలో వెంకటాచారి అనే టీచర్ ఉన్నాడు. అతను సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాల యందు పీఈటీ టీచర్‌గా పని చేస్తున్నారు. నాయకన్‌గూడెం శివారులో వెంకటచారి అనే టీచర్ బైక్‌పై వెళుతుండగా కొందరు దుండగులు కారులో వచ్చి వెనక నుండి వచ్చి బైక్‌ను గట్టిగా ఢీ కొట్టారు. దాంతో వెంకటాచారి కిందపడిపోయాడు. కారులోని కొందరు.. వారితోపాటుగా బైక్‌పై ఓ వ్యక్తి వచ్చి అతని మెడపై గొడ్డలితో నరికి దుండగులు పరారైనారని స్థానికంగా ఉన్న రైతులు సమాచారం ఇచ్చారు. అయితే హత్యకు గల కారణాలు ఇప్పటికి తెలియరాలేదు.
వెంకటాచారి రెండేళ్ల క్రితం నాయకన్‌గూడెంలో ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహించేవాడు. ప్రస్తుతం ఆ స్కూల్ నడవడం లేదు. ఘటనా స్థలాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ, ఎస్సై, సీఐ పరిశీలించారు. హత్య గావింపబడిన చోట ఎలాంటి ఆధారాలు లభించలేదని.. వారి కుటుంబసభ్యులు కూడా ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదని తెలిపారు. ఎరుపు రంగు కారు, దాని వెనకాలే బైక్ రావడం సీసీ పుటేజీల్లో కనిపించారు. దీంతో వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేయడానికి మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.