మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీలాంటి రాజకీయ నేతలు ఉండటం చాలా అదృష్టం అంటున్నారు. ఇంతకు ఆయనపై జనాలు ఇలా ప్రశంసలు కురిపించడానికి కారణం ఏంటంటే.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళను జేసీ దివాకర్ రెడ్డి స్వయంగా తన కారులో తీసుకెళ్లి.. ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. బాధితురాలి పట్ల ఆయన చూపిన శ్రద్ధను జనాలు ప్రశంసిస్తున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నం వృథా అయ్యింది. సదరు బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ వివరాలు..
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రం సమీపంలో టో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఆ సమయంలో అదే మార్గంలో తాడిపత్రి నుంచి వస్తున్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ ప్రమాదాన్ని చూశారు. వెంటనే స్పందించారు. ప్రమాద సంఘటన స్థలి వద్ద కారు ఆపారు. ‘నీకు ఏమికాదమ్మ..’ అంటూ గాయపడ్డ మహిళకి జేసీ దివాకర్ రెడ్డి ధైర్యం చెప్పారు. బాధితురాలికి సాయం చేయకుండా ఆమె వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నవారని వారించారు. ఇది వివరాలు తెలుసుకోవడానికి సమయం కాదని.. గాయపడిన మహిళకి చికిత్స అందించాలన్నారు. ఆ తర్వాత బాధితురాలిని తన కారులో ఎక్కించుకొని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. గాయపడిన మహిళకు అత్యవసర చికిత్స అందించాల్సిందిగా వైద్యులను కోరారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడుని ఆస్పత్రి వద్దకు పిలిపించి బాధితురాలికి కావాల్సిన సాయం చేయాల్సిందిగా ఆదేశించారు.
జేసీ దివాకర్ వెంటనే స్పందించి.. ఆమెను ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. విధి ఆమె పట్ల చిన్నచూపు చూసింది.. మహిళ ప్రాణాలు కాపాండేందుకు జేసి దివాకర్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించలేదు. చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆ మహిళ కన్నుమూసింది. ఆమెను బతికించాలనే ప్రయత్నంలో భాగంగా జేసీ దివాకర్ రెడ్డి తన వాహనాన్ని వేగంగా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఇక సదరు మహిళ చికిత్స పొందుతూ మరణించడంతో విషాదం నెలకొంది. విషయం తెలిసిన ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. విచారం వ్యక్తం చేశారు. ఇక జేసీ దివాకర్ రెడ్డి మానవత్వంతో వెంటనే స్పందించి ఆ మహిళను ఆసుపత్రికి తీసుకు రావడంపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. బిగ్ పొలిటిషియన్ గ్రేట్ జాబ్ అంటూ పొగుడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.