ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలను అమలు చేయడం మొదలు పెట్టాయి. అధికార పార్టీ ఇప్పటి వరకు తమ పాలనలో చేసిన అభివృద్ది పనుల గురించి చెబుతూ ప్రజల్లోకి వెళ్తుంటే. అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందే ఏమీ లేదని ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలు బహిరంగ సభలు, పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్తుంటే.. అధికార పార్టీ నేతలు తాము చేసిన అభివృద్ది పనులు గురించి చెబుతూ మరోసారి ఛాన్స్ ఇవ్వమని గడప గడపకు తిరుగుతున్నారు. ఇక టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’లపేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఆయన అనంతపురం జిల్లా పాదయాత్ర చేసుకొని.. కర్నూల్ జిల్లాలో చేరుకున్నారు. తాజాగా లోకేష్ పాదయాత్రపై టీడీపీ ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే జేసీ ప్రభాకర్ రెడ్డి.. అందుకు భిన్నంగా కనిపించారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లో యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాలో పర్యటించిన లోకేష్ అనంతపురం జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకొని కర్నూల్ జిల్లాలో అడుగు పెట్టారు. తాజాగా నారా లోకేష్ పాదయాత్రపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లోకేష్ పాదయాత్ర చేయడం శుభపరిణామం అని.. ఆయన కర్మజీవి, అతని అరికాలి బొబ్బల్ని తల్చుకుంటే నిజంగా కన్నీరు ఆగలేదన్నారు. లోకేష్ పగిలిన అరికాళ్లను చూస్తుంటే తనకే కంటనీరు ఆగడం లేదంటే.. ఇక కుటుంబ సభ్యులు ఎలా బాధపడుతున్నో ఊహంచుకోవొచ్చు అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లోకేష్ తల్లిదండ్రులకు, సతీమణికి చేతులెత్తి మొక్కుతున్న అన్నారు.
లోకేష్ యువ రాజులా ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి.. కానీ ప్రజల కోసమే ఇంత కష్టపడుతున్నారన్నారు. ఆయన సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.. బయట ఎండలు చూస్తుంటే భయం వేస్తుంది.. కానీ లోకేష్ అవేవీ లెక్కచేయకుండా తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. తన కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి రెండు రోజులు పాదయాత్ర చేస్తేనే కాళ్ల నొప్పులు వచ్చాయి.. అలాంటిది లోకేష్ వందల కిలోమీటర్లు నడుస్తున్నారు.. ఇదంతా ప్రజల కోసమే అని అర్ధం చేసుకోవాలి. లోకేష్ పాదాలు పూర్తిగా వాచిపోయాయి.. ఆయన నడుస్తుంటే కన్నీరు ఆగడం లేదు. లోకేష్ కష్టం వృదాపోదు.. అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాడు. వచ్చేది మన ప్రభుత్వమే.. లోకేష్ ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు ముందుకు సాగు అంటూ వ్యాఖ్యానించారు. ఏపీ బాగుపడాలంటే తిరిగి చంద్రబాబు సీఎం కావాలి అని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.