రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లే పలు ప్రధాన రైళ్లను ఇండియన్ రైల్వే రద్దు చేసింది. మిగతా వివరాలు మీ కోసం..!
మన దేశంలో ప్రజలు రవాణా కోసం అత్యధికంగా ఉపయోగించేది రైళ్లనే. భారీ నెట్వర్క్ కలిగిన కలిగిన భారతీయ రైల్వే.. మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించింది. అందుకే సామాన్యులు అంతర్జిల్లా, అంతర్రాష్ట్ర ప్రయాణాల కోసం ఎక్కువగా ఈ సర్వీసుల పైనే ఆధారపడతారు. అందుకు తగ్గట్లే ఇండియన్ రైల్వే తమ సేవల్ని మెరుగుపర్చుకుంటూ వెళ్తోంది. ఇదిలాఉండగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైలు ప్రయాణాలు చేసేవారికి ఓ గమనిక. శనివారం (మార్చి 4వ తేదీ) నాడు తిరిగే దాదాపుగా 250 రైళ్లను ఇండియన్ రైల్వే రద్దు చేసింది. మెయింటెనెన్స్, ఆపరేషనల్ వర్క్ తదితర కారణాల వల్ల సుమారుగా 250 రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. పైకారణాల వల్ల ఆయా రైళ్లలో కొన్ని పాక్షికంగా రద్దవగా.. మరికొన్ని పూర్తిగా రద్దయ్యాయి.
మార్చి 4న బయలుదేరాల్సిన 90 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయని అధికారిక సమాచారం. వీటిలో అమరావతి, కాన్పూర్, అసన్సోల్, ఢిల్లీ, లక్నో, బొకారో స్టీల్ సిటీ, బక్సర్, వార్ధా, నాగ్‌పూర్, పఠాన్‌కోట్, మధురై, రామేశ్వరం మొదలైన అనేక మెయిన్ సిటీల నుంచి నడిచే రైళ్లు ఉండటం గమనార్హం. ప్రయాణికులు తాము వెళ్లాల్సిన రైలు రద్దయిందో లేదో తెలుసుకోవాలంటే రైల్వే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి చెక్ చేసి తెలుసుకోవచ్చు. సైట్లో ముందుగా లాగిన్ చేసి, ప్రయాణ తేదీని ఎంచుకోవాలి. ఆ తర్వాత స్క్రీన్ ఎగువ ప్యానెల్లో ఎక్సెప్షనల్ ట్రైన్స్‌లో ఉండే క్యాన్సిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. పాక్షిక లేదా పూర్తిగా రద్దయిన ట్రైన్స్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే పూర్తి వివరాలు కనిపిస్తాయి. లైవ్ ట్రైన్ స్టేటస్‌ను కూడా అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.