వేసవికాలం ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఎండలకు భయపడి చాలా మంది ఇంటి పట్టునే ఉంటున్నారు. ఉద్యోగులకు అంటే తప్పదు. కానీ వేసవి కాలం సెలవులు లభించే టీచర్లు మాత్రం.. ఎప్పుడెప్పుడు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్నారు. మే 6 నుంచి ఏపీ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వేసవి సెలవుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం..!
ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. మే 20 వరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వారికి మాత్రమే సెలవులు మంజూరు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని పాఠశాలలకు మే 6 నుంచి జులై 3 వరకు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. జులై 4 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మే 20 తర్వాతే ఉపాధ్యాయులకు సెలవులు అందుబాటులోకి వస్తాయి.
ఇది కూడా చదవండి: పవన్ యాత్రలో అపశృతి! కింద పడ్డ పోలీస్ ని పైకి లేపిన పవన్!
పాఠశాలలకు వేసవి సెలవులు ఎప్పటి నుంచంటే..ఏపీ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్ ప్రకటించింది. వచ్చే నెల 4వ తేదీ లోపు 1 – 10వ తరగతులకు పరీక్షల నిర్వహణ పూర్తి చేయాలని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 4వ తేదీన పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఏడుస్తున్నాడని పసివాడిపై అంగన్ వాడీ ఆయా అకృత్యం!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.