ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ టైమింగ్స్ లో మార్పులు చేయాలని పలువురు విద్యాశాఖను కోరుతున్నారు. దీంతో పని వేళలలో మార్పులు తీసుకొచ్చే దిశగా విద్యాశాఖ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై నిపుణులు, ఇతర వర్గాల వారు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
నిరుపేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చింది. బాలలు కార్మికులుగా మారడాన్ని తగ్గించేందుకు బడిలోనే ఒక పూట భోజనం పెట్టడంతో.. విద్యా బుద్ధులు నేర్చుకునే అవకాశం లభించినట్లయింది. అయితే ఈ పథకం పలుమార్లు విమర్శలు వస్తున్నప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ కారణంగా ఈ మెనూలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల్లో బాగా చదవాలనే తపనను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.
దేశంలో ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిని చూపడం లేదు. కారణం అక్కడ మౌలిక సదుపాయల లేమి. క్లాసులకు తగ్గట్లుగా గదులు లేకపోవడం, బెంచీలు, బాత్రూమ్స్ వంటి కనీస సదుపాయలు ఉండవు. కానీ ఓ చిన్నారి మాత్రం తన పాఠశాల దుస్థితి గురించి ఏకంగా ప్రధాని మోదీకే విన్నవించింది.
మన దేశంలో విద్యా వ్యవస్థ కునారిల్లుతోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా సర్కారు బడుల్లో కనీస వసతులు లేక, విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక దయనీయ పరిస్థితుల్లో స్కూళ్లు మగ్గిపోతున్నాయి.
విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలు చేస్తూ.. అందరికి నాణ్యమైన విద్య అందించడమే లక్షంగా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో.. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాక.. చదువుకునే విద్యార్థులు ఆర్థిక సమస్యల కారణంగా విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో.. అనేక పథకాలను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా తయారు చేయడం కోసం.. వాటి రూపు రేఖలు మార్చడం కోసం మన బడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యావ్యవస్థలో మార్పుల కోసం సీఎం […]
నాయకుడు చేసే ఓ మంచి ఆలోచన లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. అచ్చం ఇలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఆలోచన ఇప్పుడు దేశానికే ఆదర్శం అయ్యింది. ఆ ఆలోచనే ఇప్పుడు మన దేశంలోని ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాలను మార్చబోతుంది. తెలుగు వారంతా గర్వించతగ్గ ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వ పాఠశాలలను.. ప్రైవేటు స్కూల్స్‌కు ధీటుగా తీర్చిదిద్దడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన అత్యద్భుతమైన కార్యక్రమం […]
ఇంగ్లీష్.. మన జీవితాలను ఎంత ప్రభావితం చేస్తుందో.. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. మనలో ఎంత టాలెంట్ ఉన్నా సరే.. దాన్ని అవసరమైన చోట ప్రదర్శించలేకపోతే వృధా అవుతుంది. మరీ ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో చాలా మందికి ఎదురయ్యే పరిస్థితి ఏంటి అంటే.. తమను అడిగే ప్రశ్నలకు సమాధానం తెలుసు.. కానీ దాన్ని ఇంగ్లీష్‌లో ఎలా వ్యక్త పరచాలో తెలియదు. ఆ నిమిషం భయంతో బిగుసుకుపోతాం.. గొంతు పెగలదు. ఎక్కడా లేని కంగారు వస్తుంది. ఆ […]