టీమిండియా అండర్19-ఏ, అండర్-19 బీ జట్లను బీసీసీఐ ఎంపిక చేసింది. డిసెంబర్ 28 నుంచి టీమిండియా అండర్19-ఏ, బీ జట్లతో పాటు బంగ్లాదేశ్ అండర్19 జట్టు మధ్య ట్రై సిరీస్ జరగనుంది. ఈ ట్రై సిరీస్ కోసం బీసీసీఐ రెండు అండర్ 19 జట్లను ప్రకటించింది. ఇందులో ఏ జట్టుకు కెప్టెన్‌గా గుంటూరుకు చెందిన ఎస్‌కే రషీద్‌ను నియమించింది. రషీద్ దేశవాళీ టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో అతనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ.
అలాగే వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్‌లో జరిగే అండర్– 19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు ఎస్‌కే రషీద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరి జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రషీద్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అండర్ 19 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు..