అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ ఖరారు..

under 19 trophy

వచ్చే ఏడాది తొలిసారి కరేబియన్‌ దీవుల్లో ఐసీసీ అండర్‌- 19 ప్రపంచకప్‌ జరగనుంది. ఆ టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఖరారు చేసింది. మొత్తం 14 దేశాలు వరల్డ్‌కప్‌ కోసం తలపడనున్నాయి. వచ్చే జనవరి 14 నుంచి ఫిూబ్రవరి 5 వరకు టోర్నమెంట్‌ జరగనుంది. అంటిగ్వా అండ్‌ బార్బుడా, సెంయిట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, గయానా దేశాల్లోని 10 గ్రౌండ్లలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 48 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ఐసీసీ ఈవెంట్స్‌ హెడ్‌ క్రిస్‌ టెట్లీ వెల్లడించారు. ఫైనల్‌ మాత్రం సుప్రసిద్ధ సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ మైదానంలో జరగనుంది.

భారత్‌ షెడ్యూల్‌

భారత్‌.. ఐర్లాండ్‌, సౌతాఫ్రికా, ఉగాండాలతో కలిసి గ్రూప్‌-Bలో ఉంది. పాకిస్తాన్‌ గ్రూప్‌-Cలో ఆఫ్గనిస్థాన్‌, పపువా న్యూగినియా, జింబాంబ్వేతో కలిసి ఉంది. భారత్‌ మ్యాచ్‌లు జనవరి 15న దక్షిణాఫ్రికాతో, 19న ఐర్లాండ్‌తో, 22న ఉగాండాతో భారత జట్టు తలపడనుంది. మరోవైపు గ్రూప్‌-Aలో బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్‌, కెనడా, యూఏఈ జట్లు ఉన్నాయి. గ్రూప్‌- Dలో వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, స్కాట్లాండ్‌ జట్లు ఉన్నాయి.

under 19 trophyన్యూజిలాండ్‌ ఔట్‌..

అండర్‌- 19 వరల్డ్‌కప్‌ 2022లో పాల్గొనట్లేదని న్యూజిలాండ్‌ ప్రకటించింది. అందుకు కఠినంగా ఉన్న క్వారంటైన్‌ నిబంధనలే కారణంగా తెలుస్తోంది. న్యూజిలాండ్‌ తీసుకున్న నిర్ణయంతో ఆ జట్టుకు బదులు స్కాట్లాండ్‌ అండర్‌-19 ప్రపంచకప్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.