తల్లిదండ్రులను కాదని మరి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత దైవ దర్శనం కోసం వెళ్లిన వారిని దురదృష్టం వెంటాడింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
విడాకులైన మహిళ.. పైగా ఆమెకు ఇద్దరు సంతానం ఉన్నారని తెలిసి ప్రేమించాడు. ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసి.. ఆమె ప్రేమను గెలుచుకున్నాడు. కానీ పెళ్లై పిల్లలున్న మహిళను వివాహం చేసుకోవడానికి అతడి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో వారికి తెలియకుండా ప్రేమించిన మహిళను గుడిలో వివాహాం చేసుకున్నాడు. ఆ తర్వాత.. కొత్త దంపతులు ఇద్దరు కలిసి దైవ దర్శనానికి వెళ్దామని బయలు దేరగా.. అనుకోని విషాదం చోటు చేసుకుని.. పెళ్లి చేసుకున్న సంతోషం కొన్ని క్షణాల పాటు కూడా నిలవలేదు. ఇంతకు ఏం జరిగింది అంటే..
ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివాహామైన కొన్ని గంటలకే నవ వరుడు మృతి చెందాడు. తెనాలి భిక్షావతి బజారుకు చెందిన సాయి కుమార్ స్థానికంగా ఉన్న బంగారు నగల దుకాణం షాపులో ని చేసేవాడు. అదే ప్రాంతంలోని మరో దుకాణంలో తెనాలి చెంచుపేటకు చెందిన ఉమాలక్ష్మి కూడా పని చేసేది. ఆమెకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త నుంచి విడాకులు తీసుకుని.. పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో సాయి కుమార్, ఉమాలక్ష్మిల మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు వివాహం చేసుకోవాలని భావించారు.
అయితే వీరి వివాహానికి సాయి కుమార్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఉమాలక్ష్మి తరఫు నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదు. దాంతో వీరిద్దరూ గురువారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి తెనాలి వచ్చాక.. తిరిగి శ్రీశైలం మల్లిఖార్జున సవామిని దర్శించుకునేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సాయికుమార్ తన పెద్దమ్మకు ఫోన్ చేసి అమ్మానాన్నలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నట్లు చెప్పాడు. శ్రీశైలం వెళుతున్నానని.. తామిద్దరం తిరగొచ్చేలోపు అమ్మానాన్నలకు ఎలాగోలా నచ్చచెప్పి ఒప్పించమని పెద్దమ్మను అడిగాడు.
ఆ తర్వాత సాయికుమార్, ఉమాలక్ష్మిలు శ్రీశైలం వెళ్లడానికి.. గుంటూరులో బస్సు ఎక్కేందుకు బైక్‌పై రాత్రి సమయంలో బయలు దేరారు. నారాకోడూరు బుడంపాడు మధ్యకు రాగానే.. వీరి బైక్ గుంటూరు నుంచి ఎదురుగా వస్తోన్న మరో బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాయికుమార్ అక్కడికక్కడే చనిపోగా.. ఉమాలక్ష్మికి, గుంటూరు నుంచి వస్తున్న చేబ్రోలుకు చెందిన వెంకటేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన కొన్ని గంటల్లోనే సాయికుమార్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మరి ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.