నేటి రోజుల్లో పోలీసులపై ప్రజలకు రానూ రానూ గౌరవం తగ్గి పోతుంది. ప్రతి చిన్న విషయంలో ముడుపులు తీసుకుంటారని, పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫలితం ఉండదన్న ఓ అప నమ్మకం ఏర్పడిపోయింది. దానికి తగ్గట్లుగానే వ్యవహరిస్తున్నారు కొంత మంది పోలీసులు కూడా.
దేశ సరిహద్దుల్లో శత్రు దేశాల నుండి ప్రజల్ని కాపాడుతున్నదీ ఆర్మీ అయితే.. నగరంలో, గ్రామీణాల్లో ప్రజలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు లోనుకాకుండా బాధ్యతలు చేపడుతుంటారు పోలీసులు. రక్షణ, న్యాయం కోసం మనం పోలీసు స్టేషన్లను ఆశ్రయిస్తుంటాం. కానీ నేటి రోజుల్లో పోలీసులపై ప్రజలకు రానూ రానూ గౌరవం తగ్గి పోతుంది. ప్రతి చిన్న విషయంలో ముడుపులు తీసుకుంటారని, పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫలితం ఉండదన్న ఓ అప నమ్మకం ఏర్పడిపోయింది. దానికి తగ్గట్లుగానే వ్యవహరిస్తున్నారు కొంత మంది పోలీసులు కూడా. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని, ఒక మహిళతో చెట్టపట్టాలేసుకుని తిరిగి, చివరికీ పెళ్లి చేసుకోమనే సరికి మొహం చాటేశాడో ఎస్సై. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే అప్పటి నుండి పత్తా లేకపోవడంతో అధికారులు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.
గుంటూరు జిల్లా నగరపాలెం ఎస్సై కుంచాల రవితేజ.. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. గుంటూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఏడాదిన్నరగా రవితేజ, తాను ప్రేమించుకుంటున్నామని, పలుమార్లు అతడి అపార్ట్ మెంట్‌కు వెళ్లానని, మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడని పేర్కొంది. పెళ్లి చేసుకోమని అడిగే సరికి మోహం చాటేశాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయంపై యువతి ఎస్పీ కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేసింది. అప్పటి నుండి ఎస్సై, అతడి కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని తెలిపింది. మన ప్రేమ వ్యవహారం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించేవాడని పేర్కొంది.
తనను మోసం చేసిన ఎస్సై రవితేజపై చర్యలు తీసుకోవాలని కోరింది. తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ యువతి వేడుకుంది. తొలుత అతడిపై పో్లీసులు కేసు నమోదు చేశారు. అది తెలిసి.. అప్పటి నుంచి ఎస్సై రవితేజ డ్యూటీకి రావడం లేదు. కనీసం ఫోనుకు కూడా స్పందిచడం లేదు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తాజాగా అతన్ని సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఇప్పుడు గుంటూరు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై రవితేజ క్లారిటీ ఇచ్చారు. తనపై యువతి అసత్య ఆరోపణలు చేస్తోందని.. అసలు ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు.