పాఠశాలకు వచ్చే విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికి మధ్యాహ్న భోజనం పంపిణీ చేస్తోంది. అయితే నిర్వాహణ లోపంతో కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్యాహ్న భోజనం చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఈ తరహా సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాలు..
నంద్యాల పట్టణం విశ్వనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పాఠశాలలో 92 మంది మధ్యాహ్న భోజనం చేయగా వారిలో కొంత మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.ఘీ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో.. వారు వెంటనే పాఠశాలకు చేరుకుని.. విద్యార్థులను వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విద్యార్థులకు వెంటనే చికత్స అందించడంతో ప్రమాదం తప్పిందని డీఈవో రంగారెడ్డి తెలిపారు. పాడైన గుడ్లు వడ్డించడం వలనే పిల్లలు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.