ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడిపై అధికార వైసీపీ పార్టీ మహిళా కౌన్సిలర్ ఒకరు దాడి చేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు.. ఏలూరు జిల్లా, జంగారెడ్డి గూడెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుల్లితెర నటుడు చాన్ భాషాపై వైసీపీ కౌన్సిలర్ లావణ్య దాడి చేశారు. ఆ వివరాలు.. బుధవారం నాడు నిర్వహించిన ఓ కార్యక్రమంలో చాన్ భాషా మాట్లాడుతూ.. తన స్థలాన్ని కొందరు ఆక్రమించారని పరోక్షంగా వైసీపీ కౌన్సిలర్ లావణ్య గురించి ప్రస్తావించాడు. దాంతో ఆగ్రహించిన లావణ్య.. అతడి వెనక నుంచి బలంగా నెట్టింది. ఈ దాడిలో చాన్ భాషా కిందపడిపోయాడు. దాంతో స్థానికులు వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఆక్రమణ ఘటనపై చాన్ భాషా, లావణ్య ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.