చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఊహించని ప్రమాదాలు జరుగుతాయ. కొన్ని సంఘటనలు చూస్తే.. మానవమృగాల మధ్య బతుకున్నామా అనిపించక మానదు. చిన్న పిల్లలున్న చోట తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్నారులు ఏదో ప్రమాదాన్ని తెస్తూనే ఉంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తిరుపతిలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి.. ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. ఇంటి దగ్గర నుంచి దూరంగా వెళ్లి.. అడవిలో చిక్కుకుపోయింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్లే దారి తెలియక.. దాదాపు 36 గంటలపాటు.. ఒక్కత్తే అడవిలో ఒంటరిగా గడిపింది. కుమార్తె కనిపించకుండా పోవడంతో.. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. అడవిలో చిక్కుకున్న చిన్నారి ఆచూకీ గుర్తించి.. తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా, కుప్పంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
కుప్పం మండలం నక్కలగుంట గ్రామానికి మణి, కవిత దంపతులు జోషిక అనే నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారి శనివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ ఉంది. అలా ఆడుకుంటూ ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి వెళ్లే మార్గం తెలియక అడవిలోకి వెళ్లిపోయింది. కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి: అనకాపల్లిలో దారుణం.. కాబోయే భర్త గొంతు కోసిన యువతి
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పాప ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. చిన్నారి ఆచూకీ కోసం రాత్రంతా గాలించారు. ఇంటికి సమీపంలోని కుంటల్లో ఉన్న నీటిని తోడించి.. వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి.. పాప దుస్తులు చూపించారు. ఆ డాగ్.. అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఆగడంతో… పోలీసులు అక్కడ గాలించారు.
ఇది కూడా చదవండి: ఛార్జింగ్ పెట్టి వర్క్ చేస్తుండగా పేలిన ల్యాప్ టాప్! పాపం యువతి పరిస్థితి..
అంబాపురం అటవీ ప్రాంతంలో పాప ఆచూకీ కనిపెట్టారు. చిన్నారికి చిన్నచిన్న గాయాలు ఉండటంతో వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. 36 గంటలపాటు చిన్నారి ఎంతో ధైర్యంగా అడవిలో ఒంటరిగా గడిపిందని పోలీసులు చెప్పారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బతో చిన్నారికి కాస్త అలసటగా ఉందన్నారు. అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డను తమ చెంతకు క్షేమంగా చేర్చిన కుప్పం పోలీసులకు, ఎస్పీకి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. 36 గంటల వ్యవధిలోనే తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రుల చెంత చేర్చిన కుప్పం పోలీసులును ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: 70వేలకు స్కూటీ కొని.. ఫ్యాన్సీ నెంబర్ కోసం 15.44 లక్షల ఖర్చు పెట్టాడు!