ఈ హైటెక్ జమానాలోనూ స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం కనిపించడం లేదు. పుట్టింది మగైనా, ఆడైనా సమానంగా చూడాలనే మాటలు ఆచరణలో కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో ఆడబిడ్డ పుడితే ఆర్థిక సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారో గ్రామ సర్పంచ్.
బిడ్డను చేతుల్లోకి తీసుకొని మురిసిపోయేది తండ్రయినా.. ఆ బిడ్డను నవమోసాలు మోసి.. పురిటి నొప్పి బాధలు భరిస్తూ జన్మనిచ్చేది తల్లి మాత్రమే. అలాంటి బాధలు అనుభవిస్తూ ఓ తల్లి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, దుర్మార్గపు ఆలోచన ఉన్న భర్తకు అది సంతృప్తినివ్వలేదు. మళ్ళీ ఆడబిడ్డకు జన్మనిస్తావా..? అంటూ వారిని హాస్పిటల్లోనే వదిలి వెళ్లిపోయాడు.
తమ పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి కష్టం ధరి చేరకూడదని, ఉన్నతంగా స్థిరపడాలని అందరి తల్లిదండ్రులు కోరుకునేదే. ఈ క్రమంలో వారి వారి స్థోమతకు తగ్గట్టుగా విద్యాభ్యాసాన్ని అందిస్తున్నారు కానీ, ఆడపిల్లల పెళ్లి విషయం దగ్గరకు వచ్చేసరికి అదొక తలకు మించిన భారంగా భావిస్తున్నారు. అదే మీ ఆలోచన అయితే ఈ పథకంలో పెట్టుబడి ప్రారంభించండి. అదే మీ బిడ్డకు బంగారు భవిష్యత్ ఇస్తుంది.
ఈ రోజుల్లో ఆస్పత్రులకు వెళ్లాలంటే జనాలు భయపడుతున్నారు. చిన్న రోగానికి వైద్యం చేయడానికీ వేల రూపాయలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఓ డాక్టర్ గొప్ప మనసు చాటుకుంటున్నారు. తన ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే పైసా తీసుకోవడం లేదు. ఆ వైద్యుడి కథ మీ కోసం..
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి కథ అందరికీ కన్నీళ్లను తెప్పిస్తోంది. వైద్యం కోసం కనీసం ఆస్పత్రికి వెళ్లేందుకు దారి ఖర్చులు కూడా లేక ఆ బాలిక కుటుంబం దీనావస్థలో ఉంది.
తమ పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి కష్టం ధరి చేరకూడదని, ఉన్నతంగా స్థిరపడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకునేదే. వారి స్తోమతకు తగ్గట్టుగా ఉన్నంతలో మంచి బడిలో చేర్పించడం, మంచి విధ్యాబ్యాసాన్ని అందించడం అన్నీ చేస్తారు. కానీ, ఆడపిల్లల పెళ్లి విషయం దగ్గరకు వచ్చేసరికి అదొక తలకు మించిన భారంగా భావిస్తుంటారు. ఇకనైనా అలాంటి ఆలోచనలకు పుల్ స్టాప్ పెట్టండి. నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. బాధ్యతగా బిడ్డకు చదువు చెప్పించండి. వారే ఉన్నతంగా స్థిరపడతారు. […]
మూడేళ్ళ పాపకు అన్ని అవయవాలు సరిగానే ఉన్నా.. లేచి నడవలేని పరిస్థితి. కాళ్ళు కూడా కదపలేని స్థితి ఆ చిన్నారిది. దీంతో పూర్తిగా మంచానికే పరిమితమైంది ఆ పాప. వైద్యులకు చూపిస్తే.. వెన్నెముక కండరాలకు సంబంధించిన ‘‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ అనే అరుదైన వ్యాధితో పాప బాధపడుతుందని చెప్పారు. అయితే ఈ వ్యాధికి చికిత్స ఉందని, ఒక ఇంజక్షన్ చేస్తే నయమవుతుందని డాక్టర్లు చెప్పారు. అయితే ఆ ఇంజక్షన్ ఖరీదు రూ. 18 కోట్లు అని చెప్పడంతో […]
చరిత్ర గతిలో ఇప్పటి వరకు మనం నమ్మలేని అనేక వింతలు, విశేషాలు, సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. శాస్త్రసాంకేతికత పెరిగిన నేటి కాలంలో కూడా కొన్ని మిస్టరీలను చేధించలేకపోతున్నాం. అసలు సదరు సంఘటనలు ఎలా సాధ్యం అయ్యాయో అంతు బట్టకుండా ఉంటుంది. ఎన్నడో ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటనల్లో కొన్ని తాజాగా వైరలవుతన్నాయి. ఈ క్రమంలో మదర్స్ డే రోజున.. చరిత్ర గతిలో నిలిచిపోయిన ఓ వింత సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆడుతూ.. […]
చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఊహించని ప్రమాదాలు జరుగుతాయ. కొన్ని సంఘటనలు చూస్తే.. మానవమృగాల మధ్య బతుకున్నామా అనిపించక మానదు. చిన్న పిల్లలున్న చోట తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్నారులు ఏదో ప్రమాదాన్ని తెస్తూనే ఉంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తిరుపతిలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి.. ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. ఇంటి దగ్గర నుంచి దూరంగా వెళ్లి.. అడవిలో చిక్కుకుపోయింది. అక్కడి నుంచి […]