ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాల గురించి తెలుసుకొని ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మద్య మంగళగిరిలో ఓ సమావేశాన్ని నిర్వహించారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల మంగళగిరిలో ఓ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమం కోసం తాను దేనికైనా సిద్దమే అన్నారు. గతంలో తాను అన్నిసార్లు.. అన్ని విషయాల్లో చాలా వరకు తగ్గానని.. కానీ ఈసారి మిగతావారు తగ్గితే బాగుంటుందన్నారు.
ఏపీలో అధికార పార్టీ నాయకులు కొంత మంది తనపై రక రకాలుగా కామెంట్స్ చేయడం వింటూనే ఉన్నానని అలాంటి వారికి ఈసారి ఎన్నికల్లో నేనేంటో చూపిస్తానని అన్నారు. ఇక చంద్రబాబు నాయుడు తనతో పొత్తు విషయం గురించి సరైన క్లారిటీ ఇవ్వడం లేదని.. వాటిపై క్లారిటీ వచ్చిన తర్వాతనే మిగతా విషయాలు మాట్లాడుతానని అన్నారు. ఇక పవన్ కళ్యాన్ ఈసారి జనసైనికుల ముందు మూడు అంశాల గురించి ప్రస్తావించారు. మొదటి ఆప్షన్ బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ ఎన్నికలకు సిద్దం కావడం.. రెండో ఆప్షన్ బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ.. టీడీపీతో కూడా పొత్తు కుదర్చుకోవడం, మూడో ఆప్షన్ పరిస్థితులు అనుకూలించకపోతే ఒంటరిగానైనా జనసేన పోటీ చేస్తుందని అన్నారు.
ఇది కూడా చదవండి: Visakhapatnam: ఇంటర్మీడియట్ లోనే ప్రేమలో పడింది! పెళ్లికి ప్రియుడు నిరాకరించాడని!
పవన్ కళ్యాణ్ తన మనసులో మాట బహిరంగం చేసిన తర్వాత టీడీపీ ఒకంత ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై పార్టీ నేతలను ఎలాంటి కామెంట్స్ చేయవొద్దని అంతర్గతంగా ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. గతంలో టీడీపీ, జనసేన పొత్తుగా ఉన్నా.. ఈ మద్య మాత్రం ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటు రచ్చ చేస్తున్నారు. ఆ మద్య జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా చెరోదారిన వెళ్లారు. ఇదిలా ఉంటే 2024 లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని చంద్రబాబు కి పట్టం కట్టించాలని తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు.
ఈసారి జనసేన అధినేతకే సీఎం పీటం దక్కాలని జనసైనికులు గట్టి పట్టుమీదే ఉన్నారు. అయితే చంద్రబాబు రాజకీయ చతురత ఎలా చూపించబోతున్నాడా అన్న విషయం పై ముందు ముందు తెలియాల్సి ఉంది. ఏడు పదుల వయసులో కూడా బాబు రాజకీయంగా తనదైన మార్క్ చాటుకుంటూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తూ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
ఇవి కూడా చదవండి : Chennai: టీవీ చూడొద్దన్న తల్లి..! కూతురు చేసిన పనికి అంతా షాక్!
ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికలు వస్తే.. చంద్రబాబు రక రకాల వ్యూహాలతో ముందుకు వెళ్తారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మరి ఈసారి ఎన్నికల్లో ఆయన ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్మలా ఉపయోగిస్తారా..? ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే రెండున్న సంవత్సరాలు జనసనే, మిగతా టీడీపీ కొనసాగింపుగా ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ విషయంపై తమ పార్టీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని.. పొత్తులపైకానీ ఏమీ మాట్లాడవద్దని టీడీపీ నేతలకు స్ట్రిక్ట్ గా ఆదేశాలు అందినట్లు తెలుస్తుంది. ఒకవేళ బీజేపీతో పొత్తు లేకుండా జనసేన, టీడీపీ పొత్తు కొనసాగితే.. వీరిద్దరి మధ్య ఉండే షరతులేమిటి అనే విషయం పై ఇరు పార్టీ అధినేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ముందు ముందు తెలిసిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.