ఆంధ్రప్రదేశ్ లో వరుసగా పరీక్షల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో టెన్త్ క్లాస్, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడదలయ్యాయి. తాజాగా ఈఏపీసెట్ ఫలితాలు ప్రకటించారు. జూలై 26న ఉదయం 11 గంటలకు విజయవాడ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈఏపీ సెట్ ర్యాంకులతో ఇంజినీరింగ్ కాలేజీలు, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలు పొందటానికి వీలుంటుంది. త్వరలోనే ఆయా విభాగాలకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు చెప్పారు.
ఇక ఫలితాలు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. జూలై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఏపీలో ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ ఎగ్జామ్ జూలై 4 నుంచి 8వ తేదీ వరకు జరిగాయి. అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలను 11, 12వ తేదీల్లో నిర్వహించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Vizag: విశాఖకు సీప్లేన్.. రూపుదిద్దుకుంటోన్న కార్యచరణ!