ఏపీ రాజకీయాలు ఈ మధ్య కాలంలో చాలా ప్రత్యేకం అయిపోయాయి. ఇక్కడ ఉండే సవాళ్లు, ఆరోపణలు, ట్విస్ట్ లు, త్యాగాలు, కవ్వింపులు మిగతా రాష్ట్రాలలో కచ్చితంగా ఉండవు. ఇంతేనా? ఏపీలో నాయకుల పని తీరుకి ర్యాంకింగ్స్ కూడా ఉంటాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్పుడప్పుడు ఈ ర్యాంక్ లు బయటకి చెప్తూ ఉంటారు. గతంలో గడపగడపకి కార్యక్రమంలో ఏయే నేతలు ముందున్నారో సీఎం సారే స్వయంగా ప్రకటించారు. అయితే.. ఇప్పుడు పరిపాలన విషయంలో ఏ మంత్రులు […]
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా పరీక్షల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో టెన్త్ క్లాస్, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడదలయ్యాయి. తాజాగా ఈఏపీసెట్ ఫలితాలు ప్రకటించారు. జూలై 26న ఉదయం 11 గంటలకు విజయవాడ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈఏపీ సెట్ ర్యాంకులతో ఇంజినీరింగ్ కాలేజీలు, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలు పొందటానికి వీలుంటుంది. త్వరలోనే ఆయా విభాగాలకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. […]
రెండు రోజుల క్రితం వరకు కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో.. నష్టాన్ని మిగిల్చాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇప్పటికి గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు వరద ప్రభావం నుంచి కోలుకోలేదు. ఈ భారీ వర్షాల వల్ల భద్రాచలంలో ఎంతటి ప్రమాదం సంభవించిందో ప్రత్యక్షంగా చూశాం. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంతటి భారీ వరద వచ్చిందని అధికారులు వెల్లడించారు. అటు ఏపీలో కూడా వరద ప్రభావం భారీగానే […]
ఆంధ్రప్రదేశ్ లో మే 6 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. తాజాగా ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా బుధవారం మధ్యాహ్నం విజయవాడలో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరంలో 2,41,599 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ […]
ఏపీ కేబినెట్ లో పలు మార్పులు చేర్పులు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే 24 మంది మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించారు. గురువారం ప్రారంభం అయిన కేబినెట్ మీటింగ్ కి ఖాళీ లెటర్ హెడ్‌లతో వెళ్లిన మంత్రులు కేబినెట్ భేటీలోనే వాటిపైనే తమ రాజీనామాలను చేశారు. మంత్రులు ఇచ్చిన లేఖలను తర్వాత సీఎం జగన్ గవర్నర్ కి సమర్పించనున్నట్లు సమాచారం. రాజీనామా అనంతరం సీనియర్ మంత్రి […]
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయం వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మంత్రి బొత్స మాట్లాడుతూ..”శాసన సభ.. చట్టాలను చేయవద్దంటే ఎలా కుదురుతుంది. రాజ్యాంగానికి లోబడే వ్యవస్థ అయిన పని చేయాలి. ఇది చర్చనీయాంశం. దీనిపై చర్య జరగాలి. 2024 వరకు ఏపీకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని చట్టం చేశారు. శివరామకృష్ణ కమిటీని వేసి రాజధాని నిర్ణయం తీసుకోవాలన్నారు. చంద్రబాబు స్వార్ధం కోసం నిర్ణయాలు తీసుకుంటారు.ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు […]
మూడు రాజధానుల అంశంపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులపై తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని, పాలనా వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయటమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై కేంద్రం నియమించిన జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ కూడా పాలనా […]
రాజకీయాల్లో అయినా.. సినిమా రంగంలో అయినా సరే.. లైమ్ లైట్ లో ఉన్నంత వరకే గుర్తింపు ఉంటుంది. అందుకే అటు ఇండస్ట్రీ వారు.. ఇటు రాజకీయాల్లో ఉన్న నేతలు.. తమకు పాపులారిటీ ఉండగానే.. తన వారసులను తీసుకొచ్చి.. వారు నిలదొక్కుకునేంత వరకు వెన్నంటి ఉంటారు. వారసులు సెట్ అయ్యారు.. ఇక డోకా లేదు అనిపించాక.. వారు ఆయా ఫీల్డ్ ల నుంచి తప్పుకుంటారు. తాజాగా ఏపీలో ఓ కీలక మంత్రి కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోబోతున్నారట. త్వరలోనే […]
సింగర్ పార్వతి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మారుమూల పల్లెలో జన్మించిన పార్వతి.. ఓ ప్రముఖ చానెల్ నిర్వహిస్తోన్న పాటల పోటీలో పాల్గొన్నది. కోకిల కన్నా మధురంగా ఉన్న ఆమె గాత్రానికి జడ్జీలు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో ఏం కావాలో కోరుకో అంటే.. తన ఊరికి బస్సు లేదని.. దాని వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు పడ్డానో వివరించిన పార్వతి.. తన ఊరికి బస్సు వచ్చేలా చూడమని కోరింది. ఈ విషయం […]
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూమారుడి వివాహ వేడుకలో ప్రముఖలు సందడి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్, కదిరి బాలకృష్ణ కూతురు పూజిత వివాహం హైటెక్స్ లోని కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది.బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహా వేడుకకు హాజరైన జగన్ దంపతులు వధూవరులను ఆశీర్వదించారు. వరుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, వధువు పూజితలకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల […]