ఈ ఏడాది అనేక మంది ఎంసెట్ పరీక్షలు రాశారు. ఇంజనీరింగ్, వైద్య, ఫార్మసీ చదవాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఎంసెట్‌కు 3,20,683 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,01,789 మంది పరీక్ష రాసినట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా పరీక్షల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో టెన్త్ క్లాస్, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడదలయ్యాయి. తాజాగా ఈఏపీసెట్ ఫలితాలు ప్రకటించారు. జూలై 26న ఉదయం 11 గంటలకు విజయవాడ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈఏపీ సెట్ ర్యాంకులతో ఇంజినీరింగ్ కాలేజీలు, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలు పొందటానికి వీలుంటుంది. త్వరలోనే ఆయా విభాగాలకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. […]