ఈ ఏడాది అనేక మంది ఎంసెట్ పరీక్షలు రాశారు. ఇంజనీరింగ్, వైద్య, ఫార్మసీ చదవాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఎంసెట్‌కు 3,20,683 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,01,789 మంది పరీక్ష రాసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది ఫలితాల సమయం. ఇప్పటికే ఇంటర్, పదో్ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పడు ఎంసెట్ ర్యాంకుల కో్సం ఎదురు చూస్తున్నారు విద్యార్థులు. తెలంగాణ, ఏపీల్లో ఎంసెట్ పరీక్షలు పూర్తి అయ్యాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన ఎంసెట్ పరీక్షలకు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. ఇంజనీరింగ్, వైద్య, ఫార్మసీ చదవాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ ఏడాది అనేక మంది పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఎంసెట్‌కు 3,20,683 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,01,789 మంది పరీక్ష రాసినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో గురువారం ఉదయం ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే అనుకున్న సమయానికి కన్నా ముందే ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది
ఈ మేరకు అధికారులు సమయంలో మార్పులు చేసినట్లు సమాచారం. గురువారం ఉదయం 11 గంటలకు ఎంసెట్ ఫలితాలను విడుదల చేస్తామని గతంలో అధికారులు ప్రకటించారు. అయితే ఉదయం 9:30 గంటలకే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ కారణంగా ఫలితాల సమయంలో మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.