గుంటూరు- కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టగలిగారు.. కానీ సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలకు ముగింపు పలికే టీకాను ఇంతవరకు ఏ శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఇప్పటికి మన సమాజంలో చేతబడి, బాణామతి, క్షుద్ర పూజలు వంటి దురాచారాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా గుంటూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అచ్చంపేట-మాదిపాడు ప్రధాన రహదారి తాళ్లచెరువు అడ్డరోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు స్థానికులను భయాందోళనలకు గురి చేశాయి. పూజల్లో భాగంగా పందిని అత్యంత కిరాతంగా చంపి.. పసుపు, కుంకుమ చల్లి.. నిమ్మకాయల, చీర, చాటలతో పూజలు చేశారు.
ఇది కూడా చదవండి : ఎలుకల మందుతో పళ్లు తోముకున్న వ్యక్తి.. చివరికి ఏమైందంటే!
నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై పందిని చంపి ఇలా క్షుద్ర పూజలకు పాల్పడటం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతరాత్రి అమావాస్య.. అందునా ఆదివారం కావడంతో.. వేరే ప్రాంతంలో ఈ పూజలు జరిపి.. ఆ సామాగ్రిని తెచ్చి ఇక్కడ పడేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం నాడు వచ్చే అమావాస్య రోజున పూజలు.. చేసి జీవులను బలి ఇస్తే.. క్షుద్ర దేవతలు కరుణాస్తారన్న మూఢనమ్మకం బలంగా ఉంది. ఈ క్రమంలోనే పూజలు చేసినట్లుగా భావిస్తున్నారు. నడి రోడ్డుపై ఇలా క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : పది రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న పందెం కోళ్లు.. ఎక్కడో తెలుసా..?