ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విశాఖ శాఖ స్టీల్ ప్లాంట్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం మొదలు పెట్టారు. అంతేకాదు ఏపీకి సింగరేణి బృందం పంపించడంతో కీలక పరిణాలు చోటు చేసుకున్నాయి.
ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్దమవుతున్నట్లు ఇటీవల వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్ వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లలో పాల్గొనడానికి సింగరేణి ఉన్నతాధికారుల బృందం విశాఖపట్నం వెల్లిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ తొలి విజయం సాధించిందని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణను కాకుండా అడ్డుకోవడంతో సీఎం కేసీఆర్ విజయం సాధించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశీలనకు సింగరేణి అధికారుల బృందాన్ని పంపడంతో దెబ్బకు కేంద్రం దిగివచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదైనా విషయం అనుకుంటే అది సాధించేవరకు నిద్రపోరని.. ఆయన ఎత్తు వేస్తే ఇలాగే ఉంటుందని అన్నారు. గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేత కేసీఆర్ ప్రకటించిన విషయం ఆయన గుర్తు చేశారు. ఏపీలో కేసీఆర్ పోరాటంతో దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్రం వెనుకడుగు వేసిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కుపై కేంద్రంతో పోరాడింది.. గట్టిగా మాట్లాడింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. మనం తెగించి కొట్లాడాం కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందని అన్నారు. ఇది ముమ్మాటికి ఏపీలో బీఆర్ఎస్ సాధించి తొలి విజయం అని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేంగా తెలంగాణ దూకుడు పెంచడంతో నేడు కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ పర్యటించారు. మొన్నటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్న కేంద్రం ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించిన తర్వాత ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది.