వరుస మీటింగ్‌లు, కార్యక్రమాలకు అటెండ్ అవుతూ.. బిజీబిజీగా ఉండే మంత్రి ఆదిమూలపు సురేష్.. ఒక్కసారిగా సడెన్‌గా ఆస్ప్రతిలో కనిపించడంతో.. ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆస్పత్రిలో వీల్ చైర్‌లో కూర్చున్న ఆదిమూలపు సురేష్ ఫోటో నెట్టింట వైరలవుతుంది. దీనిపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. అసలు సురేష్‌కి ఏమైంది.. ఎందుకు ఆస్పత్రిలో ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో వైరలువుతోన్న ఫోటోపై మంత్రి సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మోకాలికి సర్జరీ జరిగినట్లు తెలిపారు. గత కొంత కాలంగా మోకాలు నొప్పితో బాధపడుతున్నారు సురేష్. ఈ మధ్యకాలంలో అది మరింత తీవ్రం కావడంతో.. ఆయనకు గురువారం హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు మోకాలికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరలవుతోన్నది ఆ ఫోటోనే.
కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో టిడ్కో గృహల ప్రారంభోత్సవాలు కార్యక్రమాల్లో మంత్రి సురేష్ సుడిగాలి పర్యటన చేశారు. అలానే సీఎం జగన్ ఆదేశాల మేరకు.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. నియోజకవర్గంలో ప్రజలతో కలిసి.. ఇంటింటికి తిరగారు. విశ్రాంతి లేకుండా వరుస పర్యటనలు చేస్తుండటంతో.. మోకాలు నొప్పి తీవ్రం అయ్యింది. ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని వైద్యులు తెలిపారు.
ఇక త్వరలోనే రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా తన యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. ఇక తనపై అభిమానం చూపుతున్న రాష్ట్ర ప్రజలు, యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా మంత్రి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.