ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేలా వినూత్న పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను సీఎం జగన్ అమలు చేస్తున్నారు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. పాదయాత్ర సందర్బంగా తాను ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేశారు. తాజాగా ఏపీలో డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఇప్పటి వరకు మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తుంది. తాజాగా ఏపీలో డ్వాక్రా మహిళలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది.. ‘వైఎస్సార్ ఆసరా’ మూడో విడత కింద 78 లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.6400 కోట్ల రూపాయలను సీఎం జగన్ జమ చేయనున్నారు. ఈ మేరకు డబ్బులు అకౌంట్స్ లో జమచేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నెల 25వ తేదీన ఏలూరు జిల్లా దెందలూరు లో భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.
2019 ఎన్నికల సమయంలో పాదయాత్ర సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758 కోట్లను డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. ఈ నెల 25వ తేదీన మొదలయ్యే ఈ కార్యక్రమం ఏప్రిల్ 5 వరకు కొనసాగనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నగదు పంపిణీ చేయనున్నారు. కాగా, ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా లబ్ది పొందిన డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందే అర్హుల పేర్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.