ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేలా వినూత్న పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను సీఎం జగన్ అమలు చేస్తున్నారు.
డ్వాక్రా మహిళలకు శుభవార్త. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా గ్రూపులవారీగా రుణాలు అందిస్తున్న సెర్ప్.. ఇక మీదట వారికి వ్యక్తిగతంగానూ లోన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. గ్రామాల్లో కొత్తగా కిరాణాషాపులు, ఇతర దుకాణాలు, వ్యాపారాలు నిర్వహించాలనుకునే మహిళలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల రుణ సాయం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చిన ‘వైఎస్సార్ సీపీ’ ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న జాతీయ […]