కొన్ని రోజుల క్రితం అటు దేశవ్యాప్తంగా.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొట్టాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. గోదావరి తీర ప్రాంత ప్రజలు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులు దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. వారితో మాట్లాడి.. ఓదార్చుతూ.. నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా.. ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పర్యటనలో సందర్భంగా జగన్ ఓ మహిళ ఎత్తుకున్న చిన్నారిని తన దగ్గరకు తీసుకుని ఎత్తుకుని ముద్దాడాడు. పిల్లాడిని ఎత్తుకునే జనాల సమస్యలు విన్నారు..
అయితే ఆఖర్లో ఆ చిన్నారి ఏం చేశాడంటే.. సీఎం జగన్ జేబును తడిమాడు. ఆ చిన్నారి చేతికి జగన్ జేబులో పెన్ను కనిపించింది. ఇంకే ముంది.. చిన్నారి.. దానిని తీసుకునేందుకు ప్రయత్నించాడు. ముందు చేతికి అందకపోయినా.. తర్వాత.. రెండు చేతులతోనూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో దీనిని గమనించిన చిన్నారి తల్లి.. బుడ్డొడిని వారించే ప్రయత్నం చేసింది. అయితే.. ఇంతలోనే ఆ చిన్నారి సీఎం జగన్ జేబులో ఉన్న పెన్నును లాగేయడంతో అది కాస్తా కింద పడింది. దీంతో పక్కనే ఉన్న అధికారులు.. వెంటనే స్పందించి.. పెన్నును తీసి.. సీఎంకు అందించారు. ఆ పెన్నును సీఎం జగన్ ఆ చిన్నారికే బహూకరించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: YS Jagan Mohan Reddy: ఈ బుడ్డోడు మహా ఘటికుడు! ఏకంగా సీఎం జగన్ జోబిలోంచి పెన్ను లాగేశాడు
ఈ సంఘటన చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. సాధారణంగా సీఎం వాడే పెన్ను అంటే ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. దాంతో జగన్ బుడ్డొడికి గిఫ్ట్‌గా ఇచ్చిన పెన్ను ఏ బ్రాండ్, దాని ఖరీదు ఎంత అనే వివరాలు తెలుసుకునేందుకు నెటిజనులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఈ కామర్స్ పోర్టల్ అమెజాన్‌లో విక్రయానికి ఉంచిన ఆ పెన్ను.. మౌంట్ బ్లాంక్-145 మేస్టర్ స్టిక్ క్లాసిక్ గోల్డ్ ఫౌంటెన్ పెన్.
అమెజాన్‌లో దీని ఖరీదు 77 వేల రూపాయలకు పైగానే ఉంది. డిస్కౌంట్ తర్వాత అది 69,999 రూపాయలకు వచ్చింది. బంగారు పాళీతో తయారు చేసిన ఈ పెన్నును సీఎం జగన్ వినియోగిస్తున్నారు. ఇంత ఖరీదైన పెన్నుని బుడ్డొడికి గిఫ్ట్‌గా ఇవ్వడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. ఇక, ఈ పెన్నును సొంతం చేసుకున్న చిన్నారి తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీన్ని ఎంతో అపురూపంగా దాచుకుంటామని తెలిపారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: APలో అవినీతి నిర్మూలనకు ‘కాల్ 14400’ సర్వీస్! విస్తృతంగా ప్రచారం చేయాలన్న సీఎం జగన్!