కొన్ని రోజుల క్రితం అటు దేశవ్యాప్తంగా.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొట్టాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. గోదావరి తీర ప్రాంత ప్రజలు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులు దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. వారితో మాట్లాడి.. ఓదార్చుతూ.. నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో […]
రాయలసీమ జిల్లాలు జలప్రళయంతో అతలాకుతలమయ్యాయి. ఊహించిన ముప్పుతో ఈ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాత్రికి రాత్రే ప్రాజెక్ట్ లు, చెరువులు నిండు కుండలా మారాయి. లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవడంతో ప్రాణ నష్టం చోటుచేసుకుంది. అయితే తాాజగా ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను జగన్ పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. […]