మన దేశంలో పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం.. రెండు ఉచితంగా అందడం కల. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తే.. ఏదో ఓ విధంగా బయటపడతారు. మరి పెద్ద పెద్ద సమస్యలు వస్తే.. పరిస్థితి ఏంటి. లక్షల్లో ఖర్చు అయ్యే పరిస్థితులు, అనారోగ్య సమస్యలు వస్తే ఇక వారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరలేరు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిగా పట్టించుకోరు. ఈ క్రమంలో సరైన వైద్యం అందక కన్నుమూస్తున్న పేదలు ఎందరో ఉన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడం కోసం.. పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిచండం కోసం స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన పథకం ఆరోగ్య శ్రీ. పేదల పాలిట సంజీవని ఈ పథకం. ఇప్పటి వరకు ఎన్నో పేద, మధ్య తరగతి కుటుంబాలకు.. ఎంతో ఖర్చుతో కూడుకున్న కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందజేసింది ఈ పథకం.
ఇక ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య శ్రీ ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడిన సంఘటన తాజాగా వైరలవుతోంది. విశాఖపట్నానికి చెందిన ఇందు అనే బాలికకు తొలుత కడుపులో నొప్పి వచ్చింది. తల్లిదండ్రులు మెడికల్ షాప్‌కు వెళ్లి టాబ్లెట్ తెచ్చి వేశారు. తగ్గకపోగా.. మరింత పెరిగింది. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని పరీక్షించిని వైద్యులు.. బాధితురాలికి లివర్, గుండె సంబంధింత సమస్యలు ఉన్నాయని.. మూడు సర్జరీలు చేయాలని.. లేదంటే పాప ప్రాణాలు పోయే పరిస్థితి అన్నారు. ఎంత ఖర్చు అవుతుందో తెలిపారు. తాము పేదవాళ్లమని.. అంత ఖర్చు పెట్టుకోలేమని కోరారు. దాంతో సదరు ఆస్పత్రి సిబ్బంది వారిని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు
ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆస్పత్రిలో బిందుకు ఆపరేషన్ చేయించడానికి ప్రయత్నించారు. కానీ కార్డులో తొలుత ఆమె పేరు లేదు. యాడ్ చేయడానికి ప్రయత్నించినా కుదరలేదు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ సిబ్బంది ఒక్కరోజు వ్యవధిలోనే బాధితురాలిని తల్లిదండ్రులతో కలిపి వారికి కొత్తగా కార్డు జారీ చేశారు. వెంటనే నంబర్ వచ్చింది. దాన్ని తీసుకెళ్లి ఆరోగ్య మిత్ర సిబ్బందికి చూపించగా.. నంబర్ వస్తే సరి.. కార్డు వచ్చినట్లే అని చెప్పి.. జాయిన్ చేసుకుని చికిత్స చేశారు. ఆరోగ్య శ్రీ కార్డు లేకపోతే.. నేను చనిపోయేదాన్ని అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు మా బిడ్డ బతికుంది అంటే అందుకు ఆరోగ్య శ్రీనే కారణం అంటూ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.