ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజలా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా విద్యా, వైద్యం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు జగన్ సర్కారు ఉచిత వైద్యం అందిస్తుంది.
రోజంతా ఆటో నడిపిన వచ్చేది 400 నుంచి 500 రూపాయలు. ఇదొక్కటే వారి జీవనాధారం. అలా వచ్చేది కొద్దీ మొత్తమైనా ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వారికి కొడుకు బ్లడ్ కాన్సర్ బారిన పడ్డాడన్న వార్త వారి చెవిన పడింది. లక్షలు పోసి వైద్యం చేపించే అంత స్తోమత లేదు. పోనీ, అప్పు చేద్దామంటే నమ్మి లక్షలిచ్చేవారు లేరు. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి రూ. 78 లక్షల ఆర్థిక సాయం అందింది. కొడుకు ప్రాణాలతో ఇంటికి చేరుకున్నాడు..
మన దేశంలో పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం.. రెండు ఉచితంగా అందడం కల. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తే.. ఏదో ఓ విధంగా బయటపడతారు. మరి పెద్ద పెద్ద సమస్యలు వస్తే.. పరిస్థితి ఏంటి. లక్షల్లో ఖర్చు అయ్యే పరిస్థితులు, అనారోగ్య సమస్యలు వస్తే ఇక వారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరలేరు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిగా పట్టించుకోరు. ఈ క్రమంలో సరైన వైద్యం అందక కన్నుమూస్తున్న పేదలు […]