రోజంతా ఆటో నడిపిన వచ్చేది 400 నుంచి 500 రూపాయలు. ఇదొక్కటే వారి జీవనాధారం. అలా వచ్చేది కొద్దీ మొత్తమైనా ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వారికి కొడుకు బ్లడ్ కాన్సర్ బారిన పడ్డాడన్న వార్త వారి చెవిన పడింది. లక్షలు పోసి వైద్యం చేపించే అంత స్తోమత లేదు. పోనీ, అప్పు చేద్దామంటే నమ్మి లక్షలిచ్చేవారు లేరు. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి రూ. 78 లక్షల ఆర్థిక సాయం అందింది. కొడుకు ప్రాణాలతో ఇంటికి చేరుకున్నాడు..
బ్రతుకే భారంగా మారిన రోజులివి. చిన్న చిన్న ఆపదలు, అనారోగ్యాలు దరిచేరితే ఆర్థిక స్తోమత ఎలా ఉన్న గట్టెక్కచ్చు. అదే లక్షలు కావల్సి వస్తే ఆ ప్రాణాలపైనే ఆశలు వదులుకోవాలి. కానీ ఆ కుటుంబసభ్యులు వారి ఆశలను వదులుకోలేదు. ఏ రకంగా తమ కొడుక్కి ప్రాణం పోయేచ్చా అని ఉన్న మార్గాలను అన్వేషించారు. అలాంటి సమయంలో వారికి గుర్తొచ్చిన ఏకైక పథకం.. వైస్సార్ ఆరోగ్యశ్రీ. పోనీ, ఈ పథకం కింద లబ్ధిపొందవుదామన్నా వారికి ఆరోగ్యశ్రీ కార్డు లేదు. అయినప్పటికీ.. ప్రభుత్వం నుంచి రూ.78 లక్షల ఆర్థికసాయం అంది అతని ప్రాణాలు నిలబెట్టింది. ఎవరా యువకుడు..? ఏంటి ఈ కథ..? అన్నది ఇప్పుడు చూద్దాం..
పల్నాడు జిల్లా క్రోసూరు మండల పరిధిలోని నాగవరం గ్రామానికి చెందిన షేక్ ఉమ్మర్ ఖయ్యుం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. వారి కుటుంబ జీవనానికి ఇదేదొక్కటే ఆధారం. ఆటో నడుపుతూ వచ్చే కొద్ది మొత్తంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆయనకు పెద్ద కుమారుడు మహమ్మద్ బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడన్న వార్త తెలిసింది. చికిత్స అందిద్దామంటే ఆర్థిక స్తోమత అంతత మాత్రం. పోనీ, అప్పు చేద్దామంటే.. వేలు ఇచ్చేవారునున్నారు కానీ, లక్షలు అంటే వెనుకడుగు వేశారు. కొడుకుని ఎలా బ్రతికించుకోవాలా అని కుటుంబసభ్యులు నిత్యం తల్లడిల్లిపోయారేవారు. ఈ వార్త కొన్ని రోజుల్లోనే గ్రామమంతటా దావానంలా వ్యాపించింది. ఈ విషయం తెలుసుకున్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అతని ఇంటికి వెళ్లి పరామర్శించి వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేపించారు.
అనంతరం ఆర్థిక సహాయం కోసం సీఎం వైఎస్ జగన్‌కి అర్జీ పెట్టారు. ఈ విషయం తన దృష్టికి రాగానే వెంటనే స్పందించిన సీఎం జగన్..మహమ్మద్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంతా ప్రభుత్వమే భరించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అనంతరం మహమ్మద్‌కు ప్రభుత్వం నుంచి రూ.78 లక్షల ఆర్థిక సాయం అందింది. గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. దాదాపు 6 నెలల పాటు ఆస్పత్రిలో ఉన్న మహమ్మద్ ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు.
మహమ్మద్ ఆస్పత్రిలో ఉన్నన్నాళ్ళు వైఎస్సార్ ఆసరా కింద నెలకు రూ.5,000 చొప్పున 6 నెలల పాటు ఆర్థిక సాయం, మందులను కూడా ఉచితంగా అందజేశారు.
ఈ విషయంపై ఖయ్యుం కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. “సీఎం జగన్ లాంటి నేత ఉండటంతోనే తాము ఈ సమస్య నుంచి బయటపడ్డామని, ఆయనకు తాము ఎంతగానో రుణపడి ఉన్నామని తెలిపారు. మహమ్మద్ స్పందిస్తూ.. తనకు మరోసారి పునర్జన్మ అందించిన సీఎం జగన్‌ను జీవితంలో ఒక్కసారైనా కలిసి కృతజ్ఞతలు తెలపడమే తన కోరిక అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మహమ్మద్ వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సీఎం జగన్ తీసుకున్న చొరవపై నాగవరం గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.