ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజలా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా విద్యా, వైద్యం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు జగన్ సర్కారు ఉచిత వైద్యం అందిస్తుంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా విద్యా, వైద్యం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు జగన్ సర్కారు ఉచిత వైద్యం అందిస్తుంది. ఇప్పుడు మానవతా దృక్పథంతో ఖైదీలకు సైతం చికిత్స అందించనుంది. ఆ మేరకు ఖైదీలకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర హోమంత్రి తానేటి వనిత తెలిపారు.
ఖైదీల విషయంలో మానవత దృక్పథంతో సీఎం జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖైదీలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పోలవరం సబ్ జైలను సందర్శించారు. అలానే ఆ జైలు ఆవరణంలో నిర్మించిన హెచ్ పీసీఎల్ పెట్రోల్ బంక్ ను ఎమ్మెల్యే తెల్లం బాలారాజుతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. ఖైదీలకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం పెట్రోలు బంక్ ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఇందులో ఉపయోగించుకుంటామని, వేతాన్ని వారి కుటుంబాలకు పంపిస్తామని ఆయన తెలిపారు.
బంక్ పై వచ్చే ఆదాయాన్ని వారి అభ్యున్నతికి ఖర్చు చేస్తామని ఆమె అన్నారు. పరిశుభ్రత విషయంలో విశాఖపట్నం జైలు దేశంలోనే రెండో స్థానంలో ఉందని ఆమె వెల్లడించారు. ఖైదీల మానసికి ఎదుగుదలకు యోగాలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. దేశంలోనే మరెక్కడ లేని విధంగా ఖైదీలకు ఆరోగ్యశ్రీ కింద ఏపీ ప్రభుత్వం ఉచిత వైద్యం సేవలందించనుంది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు.. ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లోనూ వీరికి వైద్యం అందించనుంది. మరి.. ఖైదీల విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.