Mekapati Goutham Reddy Sangam Barrage: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసుల దశాబ్ధాల కల నెరవేరింది. నాడు తండ్రి పునాది వేసి ప్రారంభించిన సంగం బ్యారేజీ పనుల్ని.. నేడు తనయుడు పూర్తి చేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని ప్రారంభించారు. బ్యారేజీని జాతికి అంకితం చేశారు. జిల్లా ప్రజల దశాబ్ధాల కలను సాకారం చేశారు. ఇక, మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ కారణంగా జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. తాగునీటి, వ్యవసాయ కష్టాలు దూరమవ్వనున్నాయి. పెన్నా వరదలు, ప్రయాణ ఇబ్బందులు సైతం సమసిపోనున్నాయి. అలాంటి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు మీకోసం.. తండ్రి పునాది వేశారు.. తనయుడు పూర్తి చేశాడు.. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో సంగం బ్యారేజీకి శంకు స్థాపన చేశారు. దాదాపు 147 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2008లో పనులు ప్రారంభం అయ్యాయి. అయితే, వైఎస్సార్ మరణం తర్వాత బ్యారేజీ పనులు ఆగిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం బ్యారేజీ పనులను పూర్తి చేయలేకపోయింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ బ్యారేజీ పనులపై దృష్టి సారించారు. ఓసారి కరోనా మహమ్మారి, మరోసారి భారీ వరదలు.. ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా సీఎం జగన్ ప్రాజెక్టు పనులు ఆగనివ్వలేదు. అంచనా వ్యయం పెరిగినా ప్రజలకు మేలు జరుగుతుందని మాత్రమే ఆలోచించారు. దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పనులన్నింటిని పూర్తి చేయించారు. సెప్టెంబర్ 6వ తేదీ నాటికి ప్రాజెక్టును పూర్తి జాతికి అంకితం ఇచ్చారు. 3.85 లక్షల ఎకరాలకు సాగు నీరు.. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ కారణంగా పెన్నా డెల్టాలోని 2.47 లక్షలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు.. మొత్తంగా 3.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల ఆయకట్టు ప్రాంతాలు సస్య శ్యామలం కానున్నాయి. ఇక, బ్యారేజీలో ప్రతిరోజూ 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేయటం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. కేవలం సాగునీటికి మాత్రమే కాదు.. తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు! సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజీపై డబుల్ రోడ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దీంతో సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్య తీరింది. ఇక, పెన్నా వరదల విషయంలోనూ సంగం బ్యారేజీతో ఓ పరిష్కారం లభించినట్లయింది. మరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. HCM @ysjagan garu fulfilled the dream project of Late YSR garu CM to inaugurate the Nellore and Sangam Barrage today. Sangam Barrage is named as Mekapati Goutham Reddy Sangam Barrage. Great tributes to YSR garu and Mekapati Goutham anna#YSJaganInauguratesNelloreBarrages pic.twitter.com/oPqffjtxx6 — Harsha Vardhan Reddy A (@ahvrofficial) September 6, 2022 #MekapatiGouthamReddyBarrage, the decades-long dream of the people of Nellore district has come true. An irrigation solution for almost 5 lakh acres and transport solution for the district. Started by YSR Completed by YS Jagan #YSJaganInauguratesNelloreBarrages pic.twitter.com/aX1b9khOhE — BRahMA (@BrahmaUbaach) September 6, 2022 ఇవి కూడా చదవండి: మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించిన సీఎం జగన్!