ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్లు అమ్మకాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. ఏప్రిల్ నెల నుంచి ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వం అనుమతించిన పోర్టల్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏ క్షణంలోనైనా ప్రభుత్వం విడుదల చేయనుంది. మొదట ప్రభుత్వమే సొంత పోర్టల్ ప్రారంభించాలని భావించినప్పటికీ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పటికే ఉన్న పోర్టళ్లకు టెండర్ విధానం నిర్వహించి తక్కువ సర్వీసు ఫీజు తీసుకునే వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ టెండర్ విధానం దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: నారా చంద్రబాబు రుణం తీర్చుకోలేనిది: రాఘవేంద్రరావు
ఈ కాంట్రాక్ట్ కోసం బుక్ మై షో వంటి బడా సంస్థలు కూడా టెండర్ వేశాయి. అయితే అందరి కంటే తక్కువ సర్వీసు ఛార్జ్ తో టికెట్ల్ బుక్ చేసుకునేందుకు జస్ట్ టికెట్ కోట్ చేశారు. జస్ట్ టికెట్ కంపెనీనే ఎల్-1గా నిలిచింది. అంటే దాదాపుగా ఈ కాంట్రాక్ట్ జస్ట్ టికెట్ సంస్థకే దక్కే అవకాశం ఉంది. చెన్నై కేంద్రంగా నడిచే ఈ సంస్థలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడు అల్లు వెంకటేశ్(అల్లు బాబి) కూడా డైరెక్టర్ గా ఉన్నాడు. అంటే ఈ కాంట్రాక్ట్ అల్లు ఫ్యామిలీకి దక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో జస్ట్ టికెట్ ఏపీలో ఎంతో యాక్టివ్ గా ఉండేది. ఆ తర్వాత పేటీఎం, బుక్ మై షో వంటి యాప్స్ సినిమా టికెట్స్ బుకింగ్ అందుబాటులోకి తీసుకురావడంతో జస్ట్ టికెట్ కాస్త మందగించింది.ఆన్ లైన్ టికెట్ కాంట్రాక్ట్ జస్ట్ టికెట్ దక్కించుకుంటే ఇంక ఏపీలో ఏ సినిమా టికెట్ అయినా జస్ట్ టికెట్ పోర్టల్ నుంచే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పేటీఎం, బుక్ మై షో వంటి సంస్థలకు టికెట్స్ బుక్ చేసే అవకాశం ఉండదు. సినిమా పెద్దల కోరిక మేరకే ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని వ్యతిరేకించిన వాళ్లు కూడా లేకపోలేదు. మరి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Satellite Digital Service Provider, Qube Owned ‘Just Tickets’ is the leading contender to operate the proposed online ticketing of AP Government. Qube acquired TicketDada (Back Then Owned by Allu Bobby) earlier and rebranded it as ‘Just Tickets’.
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) March 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.