మెర్సెడెస్ బెంజ్ కారు రికార్డు సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయి.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా గుర్తుంపు పొందింది. 1955 నాటి ‘మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్‌ఆర్ కూపే’ మోడల్ వేలం పాటలో 142 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1100 కోట్లు)కు అమ్ముడుపోయినట్లు మెర్సిడెస్ సంస్థ తెలిపింది. కార్ల చరిత్రలోనే మరే ఇతర కారుకు ఇంత ధర పలికిన దాఖలాలు లేవు. ఇపుడు ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుండగా.. నెటిజన్లు ఇంత ధరకు అమ్ముడుపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మే 5న జర్మనీలోని స్టట్గర్ట్లో మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఈ వేలం పాటను ప్రైవేటుగా అతికొద్ది మంది సమక్షంలో నిర్వహించినట్లు తెలుస్తోంది. 1955 మోడల్ కు చెందిన మెర్సెడెస్ బెంజ్ 300ఎస్‌ఎల్‌ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే అని పిలిచే ఈ కారును వేలంలో ఓ వ్యక్తి ఏకంగా రూ.1100 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సంస్థ తెలిపింది. వేలాన్ని నిర్వహించిన కెనడా కంపెనీ ఆర్ఎం సూత్బే కంపెనీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. అయితే ఈ కారును ఎవరు కొనుగోలు చేశారన్న విషయాన్ని మాత్రం ఈ సంస్థ బయటపెట్టలేదు. వేలంపాటలో పాల్గొన్న కార్ డీలర్ బ్రయాన్ రాబోల్డ్ మాత్రం తన క్లయింట్ కోసం కారను కొనుగోలు చేసినట్లు చెప్పారు.
Meet the world’s most expensive car!
This 1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe, one of the only two that exist, was auctioned at an equivalent of INR 1108 crores. We’ll give you a moment to take that in. pic.twitter.com/kQ40iwxN6t
— PowerDrift (@PowerDrift) May 20, 2022
On May 5th a 1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupé was sold for €135 million ($142 million) making it the most expensive publicly sold car ever. Previous record was held by the 1962 Ferrari 250 GTO, which was sold for $48.4 back in 2018. What a beauty! 😍🤤 pic.twitter.com/bYf621if0O
— Simon Dau (@there_is_no_if) May 20, 2022
67 ఏళ్ల నాటికి మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్‌ఆర్ కూపే మోడల్లో రెండు కార్లు మాత్రమే ఉన్నాయి. అప్పటి చీఫ్ ఇంజినీర్ పేరు ఈ కారుకు పెట్టారు. గంటకు 186 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 300 హార్స్‌పవర్‌తో 8 సిలిండర్ల ఇంజిన్ ఉంటుంది. కారు డోర్లు పైకి ఉంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా డ్రైవర్‌కు రక్షణ కల్పించడం దీని ప్రత్యేకత. ఇదిలా ఉంటే.. ఆర్ఎం సూత్బే 2018లో నిర్వహించిన వేలంలో 1962కు చెందిన ఫెరారీ 250 జీటీఓ 48.4 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది.
So you want to see that record-breaking $142 Million Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe, you say? pic.twitter.com/XyK2YCkS2S
— Hannah Elliott (@HannahElliott) May 20, 2022
ఇది కూడా చదవండి: Tata Avinya: టాటా నుంచి మరో సూపర్ కార్.. అరగంట ఛార్జింగ్‌తో 500 కి.మీ. జర్నీ!