కెరీర్ ఫస్ట్ టెస్ట్ లోనే అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్!

shreyas iyer

‘న్యూజిలాండ్‌ టూర్‌ ఆఫ్ ఇండియా 2021’లో భాగంగా కాన్పూర్‌ వేదికగా తొలి టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శనతో రాణిస్తోంది. తన కెరీర్‌ లో మొదటి టెస్టులోనే శ్రేయాస్‌ అయ్యర్‌ అర్ధశతకంతో రాణించాడు. 74 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టపోయి 221 పరుగులు చేసింది టీమిండియా. మొదట శుభ్‌ మన్‌ గిల్‌ కూడా అర్ధ శతకంతో అదరగొట్టాడు. జేమిసన్‌ వేసిన బాల్‌ కు బౌల్డ్‌ అయ్యి పెవిలియన్‌ చేరాడు.

ఆ తర్వాత వచ్చిన పుజారా, కెప్టెన్‌ రహానే నిలదొక్కుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్‌ అయ్యర్‌ జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ ను కొనసాగిస్తున్నాడు. 68 ఓవర్‌ లో సౌధీ వేసిన మొదటి బంతికి సింగిల్‌ తో తన కెరీర్‌లో మొదటి హాఫ్‌ సెంచరీ సాధించాడు శ్రేయాస్‌ అయ్యార్‌. 94 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో శ్రేయాస్‌ ఈ అర్ధశతకం సాధించాడు.