‘న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా 2021’లో టీమిండియా శుభారంభం చేసింది. 3 టీ20ల సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలోకి చేరింది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్, సూర్యకుమార్ యాదవ్ మెరుపు బ్యాటింగ్‌తో విజయం చేరువైంది. భారత్ ఛేజింగ్ లో ఉన్నప్పుడు డగౌట్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది.
డగౌట్ లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఉన్నారు. వారిలో సిరాజ్ టీవీ వైపు అదే పనిగా చూస్తుంటాడు. అలా చూస్తున్న సిరాజ్ ను రోహిత్ శర్మ ఉన్నట్టుండి తలమీద ఒక్కటి పీకుతాడు. దెబ్బకు సిరాజ్ అవాక్ అయ్యి ఏంటి భయ్యా అలా కొట్టావ్ అన్నట్లు ఒక లుక్ ఇస్తాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అసలు రోహిత్ శర్మ- సిరాజ్ ను ఎందుకు కొట్టాడు అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న అయిపోయింది వారికి. అయితే ఇదంతా సరదాగా జరిగిన ఘటనే. ఎప్పుడైనా క్రికెట్ డగౌట్ ఇలాంటి ఘటనలు సర్వ సాధారణం. మరి రోహిత్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Why did Rohit hit Siraj🤣🤣🙄#INDvNZ #RohitSharma pic.twitter.com/EjqnUXts3v
— Bhanu🔔 (@its_mebhanu) November 17, 2021