క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్! తిరిగి ప్రారంభం కానున్న ఐపీఎల్-14!

ఇండియాలో క్రికెట్ కి ఉన్న ఆదరణ మరే ఇతర ఆటకి లేదు. వందల కోట్ల మంది ఈ అట అంటే పడి చస్తారు. ఇక ఇలాంటి క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అంటే ఓ పెద్ద పండగ అనే చెప్పుకోవాలి. టీ-ట్వంటీలోని అసలైన మజాని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ముందుగా రుచి చూపించింది కూడా ఐపీఎల్ మాత్రమే. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ .. 13 సీజన్స్ ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతూ వచ్చాయి. మన దేశంలో ఎన్నికలు జరిగిన సమయంలో కూడా ఐపీఎల్ ఆగలేదు. సౌత్ ఆఫ్రికాలో ఈ ధనా ధన్ లీగ్ అద్భుతంగా జరిగింది. ఇక కరోనా నేపథ్యంలో పోయిన ఏడాది ఈ రిచ్ గేమ్ టోర్నీ దుబాయ్ లో జరిగింది. కానీ.., 14 వ సీజన్ కి మాత్రం కరోనా కష్టాలు తప్పలేదు. నిజానికి ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాదని అంతా అనుకున్నారు. కానీ.., బీసీసీఐ బాస్ గంగూలీ మాత్రం బయో బబుల్ లో ఈ టోర్నీని నిర్వహించాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకు మన దేశంలోనే నాలుగు వేదికలను సిద్ధం చేశారు. దీంతో అనుకున్నట్టే ఐపీఎల్-14 ఫస్ట్ పార్ట్ అద్భుతంగా జరిగింది. కానీ.., సగం మ్యాచ్ లు అయ్యే సరికి బబుల్ బ్రేక్ అయిపొయింది. కొన్ని టీమ్స్ లో ఆటగాళ్లకి, సపోర్టింగ్ స్టాఫ్ కి కరోనా సోకింది. పైగా.., ఇండియాలో విపరీతంగా కేసులు పెరిగిపోయాయి. ఇక అంతటి క్లిష్ట స్థితిలో టోర్నీ నిర్వహణ సాధ్యం కాక బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి ఐపీఎల్ 14వ సీజన్ ని నిరవధిక వాయిదా వేశాయి. దీంతో క్రికెట్ లవర్స్ కి నిరాశ తప్పలేదు.

cricket2ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యమని అంతా అనుకుంటున్నారు. కానీ.., బీసీసీఐ ఇలాంటి స్థితిలో కూడా క్రికెట్ ఫ్యాన్స్ కి స్వీట్ న్యూస్ అందించబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుతున్న సమాచారం మేరకు.. ఐపీఎల్ 14 సీజన్ లో మిగిలిన మ్యాచ్ లు సెప్టెంబర్ మూడో వారం నుంచి దుబాయ్ వేదికగా జరగనున్నాయట. ఐపీఎల్ లో కీలకమైన ఇండియన్ ఆటగాళ్లు అంతా ప్రస్తుతం టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి సిద్ధమవుతున్నారు. ఆ తరువాత ఇంగ్లాండ్ తో అక్కడే టెస్ట్ మ్యాచ్ లు ఆడనున్నారు. ఆ సిరీస్ ముగిశాక సెప్టెంబర్ 15న ఆటగాళ్లు దుబాయ్ కి చేరుకొనున్నారట. మిగతా జట్లలోని ఆయా ఆటగాళ్లు కూడా ఈ సమయానికి దుబాయ్ కి రానున్నారు. కాబట్టి టోర్నీ నిర్వహణ ఈసారి పెద్ద కష్టం కాకపోవచ్చు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే.. అక్టోబర్ 10న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుందని తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 14 వ సీజన్ ఫస్ట్ పార్ట్ పూర్తయిన సమయానికి ఢిల్లీ జట్టు టేబుల్ టాపర్ గా ఉండటం విశేషం. మరి.., మీరు కూడా ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.