సౌతాఫ్రికాతో జరుగుతున్న కేప్ టౌన్ టెస్టులో టీమిండియా మెరుగైన ఆధిక్యాన్ని సంపాదించడానికి కష్ట పడుతోంది. మూడో రోజు టీమిండియాకి సరైన ఆరంభం లభించలేదు. మొదటి ఓవర్ రెండో బంతికే ఛతేశ్వర్ పూజారా అవుట్ కాగ, తరువాత వచ్చిన అజింకా రహానే కేవలం ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇలా.. 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన క్లిష్ట స్థితిలో బ్యాటింగ్ కి వచ్చిన పంత్ మొదట కాస్త ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. కానీ.., తరువాత సౌతాఫ్రికా బౌలింగ్ ని ఏ మాత్రం లెక్క చేయకుండా ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో 57 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉండటం విశేషం.
నిజానికి సౌతాఫ్రికా పిచ్ లపై టెస్ట్ లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం చాలా కష్టం. రెండో టెస్ట్ లో అనవసరంగా వికెట్ పారేసుకోవడంతో పంత్ పై విమర్శలు వచ్చాయి. కానీ.., రిషబ్ మాత్రం ఆ కామెంట్స్ ని లెక్క చేయకుండా మూడో టెస్ట్ లో తన దూకుడిని కొనసాగిస్తున్నాడు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ వికెట్ పడకుండా క్రీజ్ లో నిలదొక్కుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇక మూడో రోజు లంచ్ సమయానికి టీమిండియా 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒకవేళ కోహ్లీ, పంత్ భాగ్యస్వామ్యం ఇలాగే కొనసాగితే 300 పరుగుల ఆధిక్యం సాధించడం కష్ట సాధ్యమేమి కాదు. అప్పుడు టీమిండియాకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.