రోహిత్‌ శర్మకు ఎదురు దెబ్బ.. కోహ్లీ తర్వాత పంత్‌కు టీమిండియా పగ్గాలు?

Rohit Sharma and Rishabh Pant - Suman TV

ఐపీఎల్‌ 2021లో ప్లేఆఫ్స్‌కు వెళ్లే జట్లు దాదాపు ఖరారయ్యాయి. ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు ఇప్పటికే అధికారికంగా తమ ప్లేఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకోగా.. గురువారం రాత్రి రాజస్తాన్‌ రాయల్స్‌పై సాధించిన భారీ విజయంతో కోల్‌కత్తా 14 పాయింట్లు, అన్ని జట్ల కంటే మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్‌కు వెళ్లినట్టే. ఇక ఈ లిస్టులో ముంబై లేకపోవడం ఐపీఎల్‌ అభిమానులకు ఆశ్చర్యం కలిగించే అంశం. ఐదు సార్లు ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచి జట్టు, డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధించకపోవడం నిజంగా షాకింగ్‌ విషయమే. దీంతో ఈ ప్రభావం ముంబై జట్టుపై కంటే కూడా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మపై ఎక్కువ పడనుంది.

ఎందుకంటే ఐపీఎల్‌ అవ్వగానే ఈ నెల 17 నుంచి ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభం అవ్వనుంది. ఈ వరల్డ్‌ కప్‌ తర్వాత టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు విరాట్‌ కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. బీసీసీఐ పెద్దలు కూడా రోహిత్‌కు జట్టు పగ్గాలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్‌గా ముంబై జట్టును కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా తీసుకెళ్లలేకపోవడంతో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతల అప్పగింతపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Rohit Sharma and Rishabh Pant - Suman TV

రేసులోకి దూసుకొచ్చిన రిషభ్‌ పంత్‌..

విరాట్‌ కోహ్లీ తర్వాత టీమిండియాకు యువ నాయకత్వం ఉంటే బాగుంటుందని బోర్డులోని కొంతమంది పెద్దలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. టీ20 లాంటి ఇన్‌స్టంట్‌ గేమ్‌కు యంగ్‌స్టార్‌ కెప్టెన్సీ బాగా పనిచేస్తోందని వారి వాదన. అందుకు రిషభ్‌ పంత్‌ మంచి ఛాయిస్‌ అని ప్రతిపాదన ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడటంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు పగ్గాలు అందుకున్న పంత్‌, టీమ్‌ను అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. శ్రేయస్‌ గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన కెప్టెన్‌గా పంత్‌నే కొనసాగిస్తుంది ఢిల్లీ జట్టు యాజమాన్యం. ప్రస్తుతం అత్యధికంగా 20 పాయింట్లతో ఢిల్లీ పాయింట్స్‌ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది.

దీంతో రోహిత్‌ పాటు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా పంత్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రోహిత్‌ ఈ సీజన్‌లో కెప్టెన్‌గా నిరాశ పర్చడం కూడా పంత్‌కు కలిసొచ్చే అంశం. టీ20 జట్టు కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ త్వరలో వన్డే, టెస్ట్‌గా కెప్టెన్‌గా తప్పుకుంటే అప్పుడు రోహిత్‌కు వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌గా నియమించి, టీ20 జట్టు కెప్టెన్‌గా పంత్‌ను కొనసాగించేలా బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే టీమిండియాకు మరో ధోని లాంటి కెప్టెన్‌ దొరికినట్లే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరీ కోహ్లీ వారసుడిగా టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌ ఇద్దరిలో ఎవరూ ఉంటే మంచిదని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంతో తెలియజేయండి.

ఇదీ చదవండి: విరాట్‌, రోహిత్‌ అసలైన లీడర్లు.. దేశమే తమకు ముఖ్యమని నిరూపించారు