కరోనా భయంతో నిలుపుదల చేసిన మాంచెస్టర్ టెస్టు గురించే ఇప్పుడు అందరి వాదన. భారత్ చర్యతో తమకు ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లుతోందని ఐసీసీ దాకా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లింది ఈసీబీ. తమనే విజేతగా ప్రకటించాలంటూ డిమాండ్లు కూడా చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఐదో టెస్టుకు ముందు సహాయ బృందంలోని వారికి కరోనా సోకడంతో కోహ్లీసేన ఆడేందుకు నిరాకరించారు. ఈ నిర్ణయంలో ఇంగ్లాండ్ ప్లేయర్ల భద్రత కూడా దాగి ఉంది. కేవలం నష్టం వస్తోందనే ఈసీబీ ఈ రచ్చ చేస్తోంది. ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాలని భావిస్తున్నారు. రీషెడ్యూల్ అంశంపై సౌరవ్ గంగూలీ స్పందించాడు.
సెప్టెంబర్ 10న మాంచెస్టర్ వేదికగా ఆఖరి టెస్టు జరగాల్సి ఉండగా నిలిపివేశారు. ఈ మ్యాచ్ రీషెడ్యూల్ చేస్తే.. ఎప్పుడు నిర్వహించినా కూడా అది ఆ సిరీస్‌లో భాగంగానే జరగాలని గంగూలీ కోరాడు. ‘ప్రస్తుత సిరీస్ పూర్తిగా జరగాలి. సిరీస్‌లో విజయం సాధిస్తే 14 ఏళ్ల తర్వాత తొలి గెలుపవుతుంది. ఎప్పుడు నిర్వహించినా అది ఐదో టెస్టుగానే జరగాలన్నది తమ అభిమతం’ అని గంగూలీ తెలిపారు. వచ్చే ఏడాది పొట్టి క్రికెట్ సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లాండ్ వెళ్లాల్సి ఉంది. అదే సమయంలో ఈ టెస్టు మ్యాచ్‌ను రీషండ్యూల్ చేస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతానికి సిరీస్‌లో 2-1తో భారత్ ఆధిక్యంలో ఉంది.